Madhyapradesh : పిల్లలకు సెలవిచ్చి.. ఫుల్ గా తాగి స్కూల్లోనే పడకేసిన ప్రిన్సిపాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhyapradesh : మధ్యప్రదేశ్లోని రేవాలో తప్ప తాగిన ప్రిన్సిపాల్ వీడియో వైరల్గా మారింది. క్లాసులో కూర్చున్న విద్యార్థులకు ప్రిన్సిపాల్ సెలవు ఇచ్చి ఇంటికి పంపించారని ఆరోపించారు. విద్యార్థులను ఇంటికి పంపి అతడు మత్తులో క్లాస్ రూంలో నిద్రపోయాడు. ఈ విషయం రేవాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల బోడాబాగ్కు సంబంధించినది. ప్రిన్సిపాల్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు. వైరల్ వీడియోలో ప్రిన్సిపాల్ మద్యం తాగి పాఠశాల లోపల నిద్రిస్తున్నట్లు కనిపించింది. ఆ ప్రిన్సిపాల్ పేరు రమాకాంత్ అని తెలిసింది.
Read Also:France Elections 2024: హంగ్ దిశగా ఫ్రాన్స్ ఎన్నికల ఫలితాలు.. డైలమాలో మాక్రాన్..!
Also Read
- AP Cyclone Alert: 160 కి.మీ. వేగంతో గాలులు.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. సీఎం వార్నింగ్..
- Abhishek Sharma: అభిషేక్ శర్మ బ్యాటింగ్కు పాక్ దిగ్గజాలు ఫిదా..‘‘ఇంతటి విధ్వంసాన్ని ఎప్పడూ చూడలేదు!’’
- Yuvraj Singh: అభిషేక్.. నువ్వు ఇంకా 12 బంతుల్లో 50 చేయలేకపోతున్నావ్: యువరాజ్ సింగ్
- BCG Report 2026: పెట్రోల్ యుగానికి బ్రేక్ పడనుందా? భారత టూ వీలర్ మార్కెట్లో కొత్త ట్రెండ్..
మద్యం మత్తులో పాఠశాలకు చేరుకుని తరగతి గదిలో చదువుతున్న విద్యార్థులను పాఠశాల నుంచి వెళ్లగొట్టి, అక్కడ నిద్రించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇది బోడాబాగ్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రిన్సిపాల్ రమాకాంత్ వర్మ రోజువారీ చర్య ఇదే అని పలువురు ఆరోపిస్తున్నారు. పాఠశాల తరగతి గదిలోనే ప్రిన్సిపాల్ చాలాసార్లు వాంతులు చేసుకున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోయారు. ఇతని చర్యల వల్ల పాఠశాలలో చదువుతున్న పిల్లలు, వారి తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారు. దీంతో పాటు అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా ఉపాధ్యాయులు కూడా ఆందోళనకు దిగారు.
Read Also:Heart Attack : పాఠశాలలో ఒక్కసారిగా కూలబడిపోయిన విద్యార్థి.. వైరల్ వీడియో..
వైరల్ వీడియో మా దృష్టికి వచ్చిందని కలెక్టర్ ప్రతిభా పాల్ తెలిపారు. విచారణ అనంతరం నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా ఉపాధ్యాయులు మద్యం సేవించి తరగతిలోకి ప్రవేశించినట్లయితే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. దీంతో పాటు పాఠశాలలో ఎలాంటి క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినా చర్యలు తీసుకుంటామన్నారు. అలాంటి వారిపై విచారణ జరుపుతామని, ఎవరైనా ఉపాధ్యాయులు మద్యం సేవించే అలవాటుంటే అలాంటి వారిని విద్యాశాఖలో కొనసాగించకూడదన్నారు.
తాజావార్తలు
-
Arnab Cyclone: కోనసీమకు కాళరాత్రి.. గజగజ వణుకుతున్న లంక గ్రామాలు
-
KPHB Incident: కేపీహెచ్బీలో కన్నీటి విషాదం.. చిన్నారితో సహా పశ్చిమ బెంగాల్ దంపతుల ఆత్మహత్య..
-
AP Cyclone Alert: 160 కి.మీ. వేగంతో గాలులు.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. సీఎం వార్నింగ్..
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ బ్యాటింగ్కు పాక్ దిగ్గజాలు ఫిదా..‘‘ఇంతటి విధ్వంసాన్ని ఎప్పడూ చూడలేదు!’’
-
Yuvraj Singh: అభిషేక్.. నువ్వు ఇంకా 12 బంతుల్లో 50 చేయలేకపోతున్నావ్: యువరాజ్ సింగ్
ట్రెండింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!