NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా రివ్యూల మీద నిర్మాతలు, హీరోలు, దర్శకులు లేదా ఆ సినిమాకి పని చేసిన వారు ఎవరో ఒకరు కామెంట్లు చేయడం కామన్. ఈ మధ్యకాలంలో వచ్చిన ఓ సినిమా నిర్మాత మాత్రం ఒక అడుగు ముందుకేసి, తాము ప్రభాస్‌తో చేయబోతున్న సినిమాని దమ్ముంటే రివ్యూలతో ఆపండి అంటూ సవాల్ విసిరారు. నిజానికి ఏ సినిమా బాక్సాఫీస్ ఫలితాన్ని రివ్యూలు ప్రభావితం చేయలేవు.
నిజానికి తెలుగు సినీ పరిశ్రమ విషయానికి వస్తే, రివ్యూయర్లుగా భావిస్తూ తమ అభిప్రాయాన్ని మీడియా సంస్థల ప్రతినిధులుగానో లేక తమ సొంత యూట్యూబ్ లేదా ట్విట్టర్ అకౌంట్ల ద్వారానో వ్యక్తపరిచే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వ్యక్తపరిచిన అభిప్రాయం కొంతవరకు మాత్రమే ప్రేక్షకులను ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే, వాళ్లు బాలేదన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అలా అని కాదు, సినిమా అద్భుతంగా ఉంది అన్నా కూడా బాక్సాఫీస్ వద్ద ఆ రిజల్ట్ కనిపించని సినిమాలు కూడా ఉన్నాయి. మొత్తంగా చూస్తే, ఈ రివ్యూలు అనేవి కొంతమంది వ్యక్తిగత అభిప్రాయాలే తప్ప, సినిమా స్థాయిని తగ్గించే సత్తా ఆ రివ్యూలకి ఉందని ఎవరూ అనలేరు.
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
అసలు విషయానికి వస్తే, సందీప్ రెడ్డి వంగా సోదరుడు, తన సోదరుడి దర్శకత్వంలో కాకుండా మరో వ్యక్తి దర్శకత్వంలో ‘రోమాంచకం’ సినిమా చేశారు. ఆ సినిమా కంటెంట్ పరంగా రివ్యూయర్లకు కొంత కంప్లైంట్స్ ఉండి ఉండవచ్చు. ఆ సినిమా నచ్చి పాజిటివ్ రివ్యూస్ ఇచ్చిన వారు ఉన్నారు, నచ్చక తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వారు ఉన్నారు. అలాంటి వాళ్ళని ఛాలెంజ్ చేస్తూ, “ప్రభాస్ ‘స్పిరిట్’ స్థాయిని తగ్గించగలరా?” అంటూ ఆయన మాట్లాడటం ఆసక్తికరం.
వాస్తవానికి ఏ రివ్యూ రైటర్ కూడా ఏ సినిమా స్థాయిని తగ్గించలేడు, అలా అని పెంచలేడు. సినిమా గురించి నాలుగు మంచి మాటలు చెబితే ప్రేక్షకుడు సినిమా మీద ఆసక్తి కనబరిచి సినిమాకి వెళతాడేమో. ఆ సినిమా తనకు నచ్చలేదని చెబితే అసలు నచ్చని విషయాలు ఏమున్నాయి అని తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఇప్పుడు థియేటర్లలోకి వెళుతున్నారు. ఒకవేళ ప్రేక్షకుడు సినిమాకి వెళ్లాలని ఫిక్స్ అయితే, రివ్యూ పాజిటివ్ వచ్చినా, నెగిటివ్ వచ్చినా పట్టించుకోడు. ఆ సినిమా థియేటర్‌కి రప్పించుకోగలగడం సినిమా దర్శక నిర్మాతలతో పాటు హీరో హీరోయిన్ల ప్రమోషన్ల మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఛాలెంజ్‌ల కన్నా ఆ కంటెంట్ మీద ఫోకస్ చేస్తే బెటర్ అని చెప్పొచ్చు.
తాజావార్తలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!