Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Revanth Reddy Speech At Hath Se Hath Jodo Yatra

Revanth Reddy : ఆ దుశ్శాసనుడు కలెక్టరమ్మ చేయిపట్టి లాగాడు

Published Date :February 8, 2023 , 10:37 pm
By Gogikar Sai Krishna
Revanth Reddy : ఆ దుశ్శాసనుడు కలెక్టరమ్మ చేయిపట్టి లాగాడు
  • Follow Us :
  • google news
  • dailyhunt

భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ హాత్‌ సే హాత్‌ జోడో పేరుతో ములుగు నియోజకవర్గం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అయితే.. ఈ క్రమంలోనే నేడు మహబూబాబాద్‌ జిల్లాలో నిర్వహించిన పాదయాత్రలో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎవరూ సంతోషంగా లేరని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. వృద్దులకు పెన్షన్లు ఇచ్చే దిక్కు లేదని వాళ్లు గోడు వెళ్లబోసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఇందిరమ్మ ఇచ్చిన పోడు భూములను హరితహారం పేరుతో గుంజుకుంటున్నారని, ఈ ఊర్లో ఒక దుశ్శాసన ఎమ్మెల్యే ఉన్నాడని, ఆ దుశ్శాసనుడు కలెక్టరమ్మ చేయిపట్టి లాగాడని ఆయన ఆరోపించారు. మెడికల్ కాలేజీ పేరుతో పేదల భూములు గుంజుకున్నాడని, పేదల భూములను కుటుంబ సభ్యుల పేర్లతో రాయించుకున్నారని చెబుతున్నారని ఆయన విమర్శించారు. ఇక్కడ రాక్షస పాలన సాగుతోందని విమర్శించారు రేవంత్‌ రెడ్డి. కలెక్టర్లకు, కౌన్సిలర్లకు, పోడు భూములకు, పేదలకు ఇక్కడ రక్షణ లేదని ఆయన ధ్వజమెత్తారు. నకిలీ విత్తనాలతో మిర్చి రైతులను మోసం చేసిన వారిపై పీడీ వ్యక్తులు ఎందుకు పెట్టరు? అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. అప్పుల బాధతో 29 మంది రైతులు పురుగుల మందు తాగి చనిపోయారన్నారు.

Also Read : Off The Record: అధినేత దృష్టిలో పడేందుకే ప్రయారిటీ..! మంత్రిపై అధిష్టానికి ఫిర్యాదులు..

ఈ దుర్మార్గాలకు, పాపాలకు కారణం కేసీఆర్ అని ప్రజలు నా దృష్టికి తెచ్చారని, జనవరి 1, 2024 లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందన్నారు. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులైన ఆదివాసీ, గిరిజనులకు పట్టాలిస్తామన్నారు రేవంత్‌ రెడ్డి. వారి ఆత్మ గౌరవాన్ని నిలబెడతామని, భూ నిర్వాసితులందరికి నష్టపరిహారం ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. చనిపోయిన 50మంది ఆర్టీసీ కార్మికుల ఉసురు కేసీఆర్‌కు తగులుతుందని, 40వేల ఆర్టీసీ కార్మికులను చూసుకునే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. పోలీసులకు ప్రతీ వారం సెలవు ఇచ్చి.. ప్రతీ నెల1వ తేదీన జీతాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని, హోమ్ గార్డుల సమస్యలు తీరుస్తామన్నారు రేవంత్‌ రెడ్డి. మహబూబాబాద్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని, తొమ్మిదేళ్లయినా ఆ హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు రేవంత్‌ రెడ్డి.

Also Read : Revanth Reddy : రాష్ట్రంలో పాలన చూస్తుంటే రజాకార్లు మళ్లీ వచ్చినట్లు ఉంది

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • congress
  • hath se hath jodo
  • latest news
  • revanth reddy

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions