NTV Telugu Site icon

CM Revanth Reddy: బాధిత కుటుంబాలను ఆదుకుంటాం.. ప్రాజెక్ట్‌ను ఆపే ప్రసక్తే లేదు..

Revanth Reddy

Revanth Reddy

నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్‌బీసీ టన్నెల్ లో ప్రమాదం జరిగిన స్థలాన్ని నేడు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తెచ్చేందుకు తొమ్మిది రోజులుగా నిర్విరామంగా రెస్య్కూ అవుతున్న విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ ను ముఖ్యమంత్రి సమీక్షించారు. గంటకు పైగా వారితో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలా ఐనా సరే.. ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. “SLBC త్వరగా పూర్తి ఐతే ఫ్లోరైడ్ రహిత నల్గొండ ను చూడాలి అనుకున్నాం.. కానీ గత ప్రభుత్వం బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడంతో పదేళ్లుగా పనులు నిలిచిపోయాయి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. ఈ ప్రాజెక్ట్ ను పునః ప్రారంభించాం.. నిపుణులు అందరితో చర్చించే.. పనులు స్టార్ట్ చేశాం.. అనుకోకుండా దుర్ఘటన జరిగింది.. ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా సానుభూతి తెలపాలి.. 11 కేంద్ర, రాష్ట్ర సంస్థలు ఈ విపత్తు లో పనిచేస్తున్నాయి.. కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా తమవంతు సహకారం అందిస్తున్నాయి… రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ 11 సంస్థలను అభినందిస్తున్నా..” అని సీఎం అన్నారు.

READ MORE: Sonudi Film Factory: ఆశిష్ గాంధీ కొత్త సినిమా మొదలైంది!

“కన్వేయర్ బెల్ట్ ను రేపటిలోగా అందుబాటులోకి తెస్తామని చెప్తున్నారు.. కన్వేయర్ బెల్ట్ సిద్ధం ఐతే.. లోపల ఉన్న మట్టి, బురద తరలించడం ఈజీ అవుతుంది.. ఇది ఒక ప్రమాదం.. ఇది విపత్తు.. అందరం కలిసి సానుభూతి ప్రకటించాల్సిన అవసరం ఉంది. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే.. హెలికాప్టర్ ఇచ్చి మంత్రులు జూపల్లి, ఉత్తమ్ లను ఇక్కడికి పంపాను.. ఎప్పటికప్పుడు రెస్క్యూ సమాచారం తెలుసుకున్నాను.. నిమిషం నిమిషం మానిటరింగ్ చేశాను.. 8 కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటాం.. గతంలో శ్రీశైలం ప్రాజెక్ట్ లో ప్రమాదం జరిగితే.. నేను వచ్చే ప్రయత్నం చేసాను. నన్ను అడ్డుకుని అరెస్ట్ చేసింది గత ప్రభుత్వం. అవసరమైతే రోబో లను పంపి.. రెస్క్యూ ఆపరేషన్ లో వాడుకునే దిశగా ప్రయత్నం చేయాలని సూచించా. ఎలా ఐనా సరే.. ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలి అనే పట్టుదలతో ఉన్నాం.” సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.