NTV Telugu Site icon

Revanth Reddy : బండి సంజయ్ వ్యవహారం గురవిందగింజ చందంగా ఉంది

Revanth Reddy Sand Mafia

Revanth Reddy Sand Mafia

లిక్కర్ స్కాం వ్యవహారంపై మీడియాతో రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈడీ, సీబీఐ బీజేపీ జేబు సంస్థలు అంటూ ఆయన అభివర్ణించారు. లిక్కర్ స్కాం కేసులో ఏం జరుగుతుందో ఈడీ అధికారులు ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదని ఆయన అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా పట్ల వ్యవహరించనట్లు.. లిక్కర్ కేసులో కవిత పట్ల ఎందుకు వ్యవహరించడంలేదు? అని ఆయన ప్రశ్నించారు. ఇదంతా ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారని, అవినీతి ఆరోపణలు వచ్చిన రాజయ్యను బర్తరఫ్ చేసిన కేసీఆర్.. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని మండిపడ్డారు. ఈ ఇష్యూపై మౌనంగా ఉంటున్న కేసీఆర్ బండి సంజయ్ కి కనిపించడం లేదా? అని ఆయన అన్నారు.

Also Read : H3N2 Influenza Virus: హెచ్‌3ఎన్‌2 అదుపులోనే ఉంది.. ఆందోళన వద్దు..

అంతేకాకుండా.. ‘బండి సంజయ్, కిషన్ రెడ్డి పేపర్ పులుల్లా టీవీల ముందు రంకెలేయొద్దు. కేసీఆర్ అవినీతిపై నేను పిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎందుకు విచారణ చేపట్టలేదు? కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ప్రధాని, కేంద్ర మంత్రులు చెప్పారు. అయినా కేసీఆర్ అవినీతిపై ఎందుకు విచారణ చేపట్టలేదు. మీకున్న కుమ్మక్కు రాజకీయాలు ఏమిటి? బండి సంజయ్ వ్యవహారం గురవిందగింజ చందంగా ఉంది. బండి సంజయ్ వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ పై పోటీ చేస్తారో లేదో చెప్పాలి.. గతంలో పోటీ చేసిన సంజయ్.. ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోతే… బండి సంజయ్ కి, బీఆరెస్ మధ్య చీకటి ఒప్పందం ఏమిటో ప్రజలు గుర్తిస్తారు.’ అని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Also Read : Police Station: పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలోనే విగతజీవిగా పోలీసు అధికారి.. అసలేం జరిగింది?