Site icon NTV Telugu

Revanth Reddy: కొడంగల్ గడ్డ.. నా అడ్డా.. రేవంత్ రెడ్డి ఎమోషనల్ కామెంట్స్

Revanth

Revanth

Revanth Reddy: తన సొంత ఇలాకాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. సోమవారం కొడంగల్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ విజయభేరి సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ కొడంగల్ నాకు అస్థిత్వాన్ని ఇచ్చింది.. పోరాటాన్ని నేర్పింది అని అన్నారు. 20 ఏండ్లు రైతులు, విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన పోరాడానని తెలిపారు. ఈ కొడంగల్ గడ్డ… నా అడ్డా.. మీ బిడ్డ.. మీరు నాటిన మొక్క… రాష్ట్రానికి నాయకత్వం వహించే స్థాయికి ఎదిగిందని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. మీరు పెంచిన ఈ చెట్టును నరికెందుకు కేసీఆర్, ప్రధాని మోదీ భుజాన గొడ్డలి వేసేందుకు బయలుదేరిండ్రు.. వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు.

Read Also: PM Modi: భాగ్యనరంలో ప్రధాని మోదీ రోడ్‌ షో.. కాసేపట్లో కోటి దీపోత్సవానికి హాజరు

కేసీఆర్ లక్ష కోట్లు దోచుకుండు.. పది వేల ఎకరాలు దోచుకుండు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కొడంగల్ సాక్షిగా చెబుతున్నా… కేసీఆర్ కు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించడం ఖాయమని సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో దొరల, గడీల పాలన పోవాలి… ఇందిరమ్మ రాజ్యం రావాలని తెలిపారు. డిసెంబర్ 3న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి మరోసారి హామీ ఇచ్చారు.

Read Also: Rani Mukerji : ఆ సినిమా చూసి చాలా మంది విడాకులు తీసుకున్నారు..

Exit mobile version