Rani Mukerji : ఆ సినిమా చూసి చాలా మంది విడాకులు తీసుకున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొన్న బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ షాకింగ్స్ కామెంట్స్ చేసారు.. తాను నటించిన కభీ అల్విద నా కహెనా మూవీ చూసిన తర్వాత ఎంతో మంది విడాకులు తీసుకున్నట్లు ఆమె తెలిపారు.ఈ సినిమా ను ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహార్ తెరకెక్కించారు.ఈ సినిమా చూసిన తర్వాత ఎంతో మంది సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాణీ ముఖర్జీ చెప్పుకొచ్చారు.. “కభీ అల్విద నా కహెనీ మూవీ రిలీజ్ అప్పుడు చాలా మంది థియేటర్లకు వెళ్లి ఈ సినిమాను కాస్త అసౌకర్యంగానే చూశారు. ఈ సినిమాకు కరణ్ కు వచ్చిన ఫీడ్‌బ్యాక్ కూడా ఇలాగే ఉంది. ఈ సినిమా ఎంతో మంది కళ్లు తెరిపించింది. సంతోషంగా ఉండాలని చాలా మంది విడాకులు తీసుకున్నారు.అని రాణీ ముఖర్జీ చెప్పింది.కభీ అల్విద నా కహెనా మూవీలో రాణీ ముఖర్జీతోపాటు షారుక్ ఖాన్, అభిషేక్ బచ్చన్ మరియు ప్రీతి జింటా నటించారు. ఇష్టం లేని కాపురం చేయలేక సినిమాలో ఈ రెండు జంటలు తమ భర్త లేదా భార్యను వదిలేసి మరొకరితో కలిసి జీవిస్తారు. ఆ విషయంలో ఈ సినిమా చాలా మంది కళ్లు తెరిపించిందని రాణీ ముఖర్జీ చెప్పడం గమనార్హం.
ఈ సినిమాలో తన పాత్ర గురించి కూడా ఆమె ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.”ఇందులోని మాయ పాత్ర ఎంతో అందమైనది. ఆమె రిషీని మరో విధంగా ప్రేమిస్తుంది. షారుక్ ఖాన్ పోషించిన పాత్రలో ఆమె తాను ఎప్పుడూ కోరుకునే రొమాన్స్ ను కూడా గుర్తిస్తుంది. ఓ మహిళ కు సంబంధించి ఆమె ఏం కావాలనుకుంటుంది అన్నదానిపై మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓ భర్త కేవలం కొట్టకపోయినంత మాత్రాన అతడు బెడ్ పై బాగా ఉంటాడని లేదంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని కాదు. ఈ మగాడిని చూసి ఆకర్షితురాలివి అయ్యావా అని ఎవరూ ఓ మహిళను అడగరు” అని రాణీ ముఖర్జీ చెప్పింది.ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. రాణీ ముఖర్జీ రీసెంట్ గా మిసెస్ ఛటర్జీ వెర్సెస్ నార్వే సినిమాలో నటించింది.నార్వేలో ఓ భారతీయ మహిళకు ఎదురైన చేదు అనుభవం ఆధారంగా ఆ సినిమా రూపొందింది.
Also Read
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!