Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Revanth Reddy Letter To Cm Kcr 3

Revanth Reddy : సీఎం కేసీఆర్‌కు చీఫ్‌ రేవంత్‌రెడ్డి లేఖ

Published Date :December 31, 2022 , 3:54 pm
By Gogikar Sai Krishna
Revanth Reddy : సీఎం కేసీఆర్‌కు చీఫ్‌ రేవంత్‌రెడ్డి లేఖ
  • Follow Us :
  • google news
  • dailyhunt

సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మరోసారి లేఖ రాశారు ఎండనక, వాననక కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర దక్కకుండా దళారులు రైతును దగా చేస్తుంటే.. రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం చోద్యం చూసోందని ఆయన లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా.. పంట ఏదైనా వ్యాపారులు, దళారులు చెప్పిందే రేటు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. మద్దతు ధర అంటూ రైతులు రోడ్డెక్కితే ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. ఇంతటి విపత్కర పరిస్థితుల మధ్య ఉన్న రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకుంటే… రైతులు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలి? వానలు, చీడపీడల బెడదను తట్టుకుని పండిన పత్తిని చూసి రైతాన్న అనందం మార్కెట్లో ధర చూడగానే ఆవిరైపోతుంది. దళారులు రాజ్యంలో గిట్టుబాట ధర రాకపోవడంతో రోడ్డెక్కి ఆందోళ చేయాల్సిన స్థితి దాపురించింది. క్వింటాలుకు రూ.6-7 వేలు చెల్లిస్తుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పెట్టిన పెట్టుబడిని పరిగణనలో తీసుకుంటే కనీసం రూ.15 వేలు రాకుంటే గిట్టుబాటు కాని పరిస్థితి.
Also Read : Flexi war between YCP leaders: అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు.. న్యూ ఇయర్‌ ఫ్లెక్సీ వార్‌..

మరోవైపు రాష్ట్రంలో రైతులు సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్నారు. సరైన వ్యవసాయ విధానం లేకపోవడం, పంటల ప్రణాళిక లేకపోవడం, రైతులకు దిశానిర్దేశం చేసే వ్యవస్థలు కుంటుపడిపోవడం, రుణ ప్రణాళికలు సరిగా అమలు చేయకపోవడం, సరైన విత్తనాలు, పురుగు మందుల సరఫరా చేయలేకపోవడం ప్రకృతి విపత్తుల సమయంలో భరోసా ఇవ్వలేకపోవడం, తెగుళ్లు సోకి పంట నష్టం జరిగినప్పుడు పరిహారానికి భరోసా లేకపోవడం వంటి అనేక కారణాలు వ్యవసాయాన్ని, రైతును సంక్షోభంలో పడేశాయి.
Also Read : New Covid Variant: భారత్‎లోకి కొత్త కోవిద్ వేరియంట్.. గుజరాత్‎లో మొదటికేసు

మీ విధానాల ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా సగటున రోజుకు ఇద్దరు అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని జాతీయ క్రైం బ్యూరో (ఎన్సీఆర్బీ) లెక్కలు చెబుతున్నాయి. ఈ నివేదిక ప్రకారం గత 2014 నుంచి 2021 వరకు రాష్ట్రవ్యాప్తంగా 6,557 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఏడాదిలో నవంబరు దాకా అంటే 11 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 512 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నట్లు ఓ స్వచ్చంద సంస్థ చేసిన అధ్యయనం తేల్చింది. మొత్తంగా 2014 నుంచి చూస్తే గత తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో 7,069 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.’ అంటూ రేవంత్‌ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • BRS
  • cm kcr
  • congress
  • latest news

తాజావార్తలు

  • Sri Rama Navami 2026: శ్రీరాముడి పూజా విధానం, శుభ ముహూర్తం, హారతి విధానం

  • Bro 2 Update: పవన్ కళ్యాణ్ ‘బ్రో 2’పై సముద్రఖని క్లారిటీ.. ఇంతకీ ఏమ్మన్నాడంటే?

  • Petrol and Diesel Prices Drop: గుడ్‌న్యూస్‌ చెప్పిన కేంద్రం.. పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం భారీగా తగ్గింపు

  • Virat Kohli New Tattoo: ఐపీఎల్‌కు ముందు విరాట్ కోహ్లీ కొత్త టాటూ.. దాని అర్థం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

  • Anantapur Crime: సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ సమయంలో పోలీసులపై నిందితుల దాడి.. ఆత్మరక్షణ కోసం కాల్పులు..

ట్రెండింగ్‌

  • Food Storage Tips : ఫ్రిడ్జ్‌లో మాంసం నిల్వ ఎంతకాలం సేఫ్.?పాడైన మాంసాన్ని గుర్తించే సింపుల్ టిప్స్.!

  • Soft Uttapam Tips : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ‘ఉతప్పం’.. హోటల్ రుచి రావాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించండి.!

  • JIO Offers: జియో నుండి భారీ ఆఫర్.. 3 నెలల రీచార్జ్‌కు 1 నెల ఫ్రీ..!

  • CSK Opening Pair 2026: సీఎస్‌కే ఓపెనింగ్ కాంబో ఫిక్స్.. ఆయుష్‌ మాత్రే అవుట్!

  • Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions