NTV Telugu Site icon

Revanth Reddy: కాంగ్రెస్-బీఆర్‌ఎస్‌ల మధ్య పొత్తుపై రేవంత్ కీలక వ్యాఖ్యలు

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy: కాంగ్రెస్-బీఆర్‌ఎస్‌ల మధ్య పొత్తుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. మీడియాతో చిట్‌చాట్‌లో ఈ మేరకు వ్యాఖ్యానించారు. సహజ మిత్రుడు, పార్ట్‌నర్ అంటూ అసదుద్దీన్‌ గురించి రేవంత్ మాట్లాడారు. ఎంఐఎంకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ సీటు ఇచ్చిందని ఆయన ఆరోపించారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంల మధ్య ఉందని ఆయన అన్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం మూడు పార్టీల మధ్య జరుగుతోందన్నారు. ప్రచారంలో ముగ్గురు ఉంటున్నారని.. ఎన్నికల్లో ఇద్దరే అవుతున్నారని రేవంత్ పేర్కొన్నారు. ప్రజలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్నారు.

80 శాతం తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్నారని.. ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. తెలంగాణ అభివృద్ధిలో ఆంధ్ర అభివృద్ధి చాలా ఉందన్నారు. తెలంగాణ వస్తే ఏదో జరుగుతుంది అనుకున్నామని.. కానీ తెలంగాణలో స్వేచ్ఛ లేదని రేవంత్ చెప్పారు. తెలంగాణలో ధర్మ గంట ఉందా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజా దర్బార్ లేదన్నారు. కాంగ్రెస్‌కు 20 సీట్లు వస్తే పోతారు అని.. అందుకే పార్టీకి 80 సీట్లు ఇస్తారని ఆశిస్తున్నా అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.

Read Also: Congress: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీలపై సీబీఐకి కాంగ్రెస్ ఫిర్యాదు

కేసీఆర్ 25 సీట్లకు దాటరని.. బీజేపీ సింగిల్ డిజిట్స్‌కే పరిమితం కానుందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ మాఫియాతో చేతులు కలపదని.. పార్లమెంట్‌ బీఆర్‌ఎస్ వ్యవహారాలు వేరు, రాష్ట్ర రాజకీయాలు వేరని పేర్కొన్నారు. బండి సంజయ్ కరీంనగర్‌లో పోటీ చేయాలని రేవంత్ అన్నారు. బీజేపీతో కొట్లాడినట్లు కనిపిస్తూ కాంగ్రెస్‌ను మింగేస్తారని.. అందుకే ధృతరాష్ట్ర కౌగిలికి మేం సిద్ధంగా లేమన్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాలు మారుతాయని రేవంత్ చెప్పారు. మహారాష్ట్రలో కేసీఆర్ బీజేపీ టాస్క్ అమలు చేస్తున్నారన్నారు. లక్ష కోట్ల దోపిడీతో కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడిందని రేవంత్ ఆరోపించారు. దీనిపై కేంద్రం ఒక్క కేసు కూడా పెట్టలేదన్నారు. తెలంగాణ విభజన తర్వాత అన్ని పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని ఆయన ఆరోపించారు.

Show comments