మరోసారి బీఆర్‌ఎస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేటీఆర్.. సోమేశ్.. అరవింద్ లను అమరవీరుల స్థూపం దగ్గర గుంజ కి కట్టేసి కొట్టినా తప్పు లేదంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 111 జీవో ఎత్తివేస్తే… హైదరాబాద్ మునిగిపోతుందని, మాస్టర్ ప్లాన్ ఎందుకు పెట్టలేదన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఈ దుర్మార్గంకి కారణం సోమేశ్.. అరవింద్ కుమార్ అని ఆయన ఆరోపించారు. లబ్ది దారులు… కేసీఆర్.. కేటీఆర్ అని ఆయన మండిపడ్డారు. బీజేపీ నేతలకు ఏమాత్రం సిగ్గు ఉన్నా… సీబీఐ విచారణ జరిపించాలన్నారు. కిషన్ రెడ్డి లేఖ రాయ్ అని ఆయన అన్నారు.
Also Read : AP Governor Abdul Nazeer : 2030నాటికల్లా ఆహార భద్రత సాధించాలి : గవర్నర్ అబ్దుల్ నజీర్
బీజేపీ ఎందుకు విచారణ చేయవని, బండి సంజయ్ రంకెలు వేయడం మానుకో అని ఆయన అన్నారు. అంతేకాకుండా.. ‘ఇష్టం ఉన్నట్టు మాట్లాడటం కాదు.. మోడీ.. ఢిల్లీలో కేసీఆర్ కి నజరానా ఇచ్చాడు.. పార్టీ కార్యాలయం కోసం భూమి ఇచ్చారు. ఇప్పుడు 111 జీవో లో భూమి రాసుకున్నాడు కేసీఆర్. 50 ఏండ్లు అధికారంలో ఉన్నా.. మేము పార్టీ ఆఫీస్ కట్టుకోలేదు. కానీ కేసీఆర్ వందల ఎకరాలు పార్టీ కోసం తీసుకున్నాడు. మా పార్టీ కోసం భీం రావు బస్తీ లో భూమి ఇస్తే కోర్టు లో కేసు వేశారు. సుప్రీంకోర్టులో కేసు వాదించాము అని కేసు వెనక్కి తీసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీకి కార్యాలయం ఇవ్వవా. భీం రావు బస్తీ భూమి పేదలకు ఇస్తా అంటే ఇవ్వండి. మాకు ప్రత్యామ్నాయ భూమి ఇవ్వు.. మేము ప్రభుత్వానికి డబ్బులు కట్టినం.. కేసు వాపస్ తీసుకున్నావు కేసీఆర్. ఇదా నీ రాజకీయ విజ్ఞత. నువ్వు 11 ఎకరాలు కేటాయించుకోవడం దుర్మార్గం. మాకు కేటాయించిన ఒక్క ఎకరా కూడా మాకు ఇవ్వలేదు. గుండోడు బండో డు … గడ్డి తిన్నట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళు వాళ్ళు కలిశారు అంటున్నారు. గడ్డితిన్న మాటలు మాట్లాడకు. బోయినపల్లి గాంధీ ఐడియాలజీ కేంద్రం.. అక్కడికి వచ్చి కేసీఆర్ కూడా గాంధీ బోధనలు వినొచ్చు.. అది పార్టీ ఆఫీస్ కాదు’ అంటూ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
