CM Revanth Reddy : జన్మనిచ్చిన గడ్డపై వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది
- స్వగ్రామంలో దసరా వేడుకలు జరుపుకున్న సీఎం
- తన ఊరు ఎంతో స్ఫూర్తినిచ్చిందన్న రేవంత్ రెడ్డి
- ప్రజలతో కలిసి పండుగ చేసుకోవడం ఆనందంగా ఉందని వ్యాఖ్య
- తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయదశమి పర్వదినం సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో నిర్వహించిన దసరా వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పండుగ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంప్రదాయ రావణ దహనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
నాకు కొండంత స్ఫూర్తినిచ్చిన నేల కొండారెడ్డిపల్లి: సీఎం రేవంత్
సొంత ఊరైన కొండారెడ్డిపల్లిలో దసరా వేడుకలు జరుపుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఆత్మీయ సందేశాన్ని పంచుకున్నారు. “ఒక సామాన్యుడి స్థాయి నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగే క్రమంలో నాకు కొండంత స్ఫూర్తిని, ధైర్యాన్ని ఇచ్చిన శక్తివంతమైన నేల నా స్వగ్రామం కొండారెడ్డిపల్లి. మనకు జన్మనిచ్చిన గడ్డపైనే ఊరి ప్రజలతో కలిసి దసరా పండుగ జరుపుకోవడం వర్ణించలేని సంతోషాన్ని ఇచ్చింది” అని ఆయన పేర్కొన్నారు.
Also Read
- HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
- Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీ అకాడమిక్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 26 నుంచి ఆన్లైన్ క్లాసులు
- OTR: ముగ్గురు మంత్రులు.. ముగ్గురు వారసులు! నెక్స్ట్ ప్లాన్ ఏంటి?
- Bhatti Vikramarka : తెలంగాణకు సూపర్ ఎల్ నినో ముప్పు.. డిప్యూటీ సీఎం భట్టి కీలక విజ్ఞప్తి
రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి..
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలని సీఎం రేవంత్ రెడ్డి కాంక్షించారు. రాష్ట్ర ప్రజలంతా పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండేలా తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ అందించాలని కొండారెడ్డిపల్లి ఆంజనేయస్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు. సొంత ఊరిలో దసరా వేడుకలు జరుపుకోవడానికి వచ్చిన సీఎంకు గ్రామస్తులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!