NTV Telugu Site icon

Revanth Reddy : రాష్ట్రంలో పాలన చూస్తుంటే రజాకార్లు మళ్లీ వచ్చినట్లు ఉంది

Revanth Reddy

Revanth Reddy

మహబూబాబాద్ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ములుగులో నా వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారట.. రాజ్యాలను కూల్చి రాచరికాన్ని బొంద పెట్టిన చరిత్ర తెలంగాణదని, రాష్ట్రంలో పాలన చూస్తుంటే రజాకార్లు మళ్లీ వచ్చినట్లు ఉందన్నారు. ఎక్కడ దోపీడీలు, కబ్జాలు జరిగినా అక్కడ బీఆర్‌ఎస్ నేతలున్నారని, బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఎందుకు నిర్మించలేదని ఆయన ప్రశ్నించారు. ఇన్ని అక్రమాలకు పాల్పడిన కేసీఆర్ ను, ఆయన సామంత రాజు శంకర్ నాయక్ ను శంకరగిరి మాన్యాలకు తరిమే బాధ్యత మీపై ఉందని, కేసీఆర్ కాదు.. కింద పనిచేసే కుక్కలు వచ్చినా.. నెత్తి మీద కాలు పెట్టి తొక్కి.. పాతాళానికి పంపిస్తామన్నారు. ప్రగతి భవన్ లోపలికి పేదలకు ఎందుకు ప్రవేశం లేదని, అందుకే చెప్పా.. ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడతామని, కేసీఆర్ గుర్తు పెట్టుకో బిడ్డా….కొత్త ఏడాదిలో ప్రగతి భవన్ గడీపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామన్నారు రేవంత్‌ రెడ్డి.

Also Read : Brain Health: నోటి అపరిశుభ్రత మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.. తాజా అధ్యయనంలో వెల్లడి

దారిపొడవునా ఎవరిని కదిలించినా వారికి దుఃఖం పొంగుకొస్తోందని, బీఆర్‌ఎస్ ను వందమీటర్ల గోతి తీసి పాతిపెట్టాలని ఆవేశంగా చెబుతున్నారన్నారు. మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వస్తేనే బాగుపడతామని మా ఆడబిడ్డలు చెప్పారని, ఆర్టీసీ కార్మికులు తమ గోడు వెళ్లబోసుకున్నారని, నీరంకుశ పాలనలో తమను వేధిస్తున్నారని ఆవేదనగా చెబుతున్నారని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్టీసీలో 6200 బస్సులుంటే 3200 బస్సులు ప్రైవేటువేనన్న రేవంత్‌ రెడ్డి.. 50వేల మంది చేసే పనిని 40వేల మందితో వెట్టి చాకిరి చేయిస్తున్నారని మండిపడ్డారు. ఒకటో తారీఖున వచ్చే జీతాలు.. 8 వ తేదీ వచ్చినా రాలేదని కంట తడి పెట్టారని, అవకాశం వచ్చిన రోజు కేసీఆర్ సర్కారుకు కర్రు కాల్చి వాత పెడతామని ఓ మహిళా కండక్టర్‌ ఆవేదనగా చెప్పిందని రేవంత్‌ రెడ్డి అన్నారు.

Also Read : MLC Kavitha : పేద ప్రజల మీద ఆలోచన లేని మోదీ ప్రధానిగా అవసరమా