హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక సీఎం కుటుంబంతో సహా మంత్రులు ఎమ్మెల్యేలు, సాండ్ లాండ్ మైన్ వైన్ వ్యాపారాలు చేస్తూ ప్రజల్ని ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు. సాక్షాత్తు కేటీఆర్ నియోజకవర్గంలో ఇసుక మాఫియా దాడులు చేశారని ఆయన అన్నారు. తనుగుల గ్రామం వద్ద ఎంపీ సంతోష్ తండ్రి బినామీ పేర్లతో ఇసుక క్వారీ నిర్వహిస్తూ అక్రమంగా దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేస్తున్నారని, కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీగా ఈ క్వారీని సందర్శించామన్నారు. యథేచ్ఛగా ప్రొక్లైన్స్ వినియోగించి ఇసుక దోపిడీ చేస్తున్నారని, అధికారులు వారికి వత్తాసు పలుకుతున్నారు.. మేము అడిగినా అందుబాటులోకి అధికారులు రాలేదని ఆయన అన్నారు.
Also Read : Manik Rao Thakre : హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది
అంతేకాకుండా..’క్వారీ వల్ల బోర్లు ఎండిపోయి నిరసన తెలిపిన రైతులపై అక్రమ కేసులు పెడుతున్నారు.. ఇసుక మాఫియాతో ఉన్న చీకటి అనుబందంపై సీఎం సమాధానం చెప్పాలి.. క్వారీ వల్ల బోర్లు ఎండుతున్నాయ్ రోడ్లు నాశనం అయ్యాయి.. ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు… కేసీఆర్ కుటుంబం ప్రత్యక్ష పాత్ర వల్ల దోపిడీ యథేచ్ఛగా సాగుతున్నాయి.. ప్రభుత్వం పై పోరాటం చేస్తా.. కేసీఆర్ పై యుద్ధం అని ప్రకటించిన ఈటెల రాజేందర్ ఎక్కడున్నారు… ఈటల నియోజకవర్గ పరిధిలో ఇంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంటే ఈటల ఏం చేస్తున్నారు? బీజేపీ బీఆర్‌ఎస్ మిలకత్ లో భాగంగానే ఈటల మౌనం.. ఇక్కడి ఎంపీ బండి సంజయ్ ఎమ్మెల్యే ఈటల ఏం చేస్తున్నారు… నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి ఎందుకు వెళ్ళలేదు.. కాంగ్రెస్ పార్టీ ఈ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతుంది.. రైతులకు, ప్రజలకు అండగా ఉంటాం.. బీజేపీ నాయకులు అధికారం కోరుకుంటున్నారు… ఇసుక దోపిడీ, గ్రానైట్ దోపిడీ పై బీజేపీ వైఖరి బండి సంజయ్, ఈటల చెప్పాలి.. కాళేశ్వరం ప్రాజెక్ట్ కొట్టుకుపోవడానికి కారణం ఇసుక క్వారీలే.’ అని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే.. ‘నా కోటి రతనాల వీణ ..మాఫియా పాలైంది.. లాండ్, సాండ్, మైన్ ఏదైనా కాదేదీ దోపిడికి అనర్హం అంటూ.. రాజ్యమేలుతున్న ఈ చీడ పురుగులను తెలంగాణ పోలిమేరల దాకా తరిమేందుకే ఈ “యాత్ర”’ అంటూ రేవంత్ రెడ్డి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
Also Read : Scientific mystery thriller: ‘కరాళ’గా రాబోతున్న కన్నడ ‘బీగా’!