Revanth Reddy : కామారెడ్డిలో మీ భూములను కాపాడే బాధ్యత నాది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కామారెడ్డి రెడ్డిపేట లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఓటరన్న మేలుకో.. నిరుద్యోగిని కాపాడుకో అంటూ నిరుద్యోగులు బ్యానర్లు పట్టుకుని తిరుగుతున్నారన్నారు. తెలంగాణ వస్తే కొలువులు వస్తాయని నిరుద్యోగులు భావించారని, కానీ పదేళ్లలో కేసీఆర్ ఉద్యోగ నియామకాలు చేపట్టలేదన్నారు రేవంత్ రెడ్డి. పరీక్ష పత్రాలు లీక్ అయి జిరాక్స్ సెంటర్ లలో అమ్ముకుంటుంటే.. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆత్మహత్య చేసుకున్న ఏ కుటుంబాన్నైనా కేసీఆర్ గానీ, ఎమ్మెల్యేలు గానీ పరామర్శించారా? అని ఆయన ప్రశ్నించారు.
అంతేకాకుండా.. ‘హైదరాబాద్ లో ట్యాంక్ బ్యాండ్ పై రైతు ఉరి వేసుకుని చనిపోతే పరామర్శించిన నాధుడు లేడు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పేరుతో మీ భూములు గుంజుకునే ప్రయత్నం చేసిండ్రు.. రైతులు అడ్డుకుంటే పోలీసులతో కొట్టించిండ్రు తప్ప బీఆరెస్ నేతలు అండగా నిలవలేదు. ఇప్పుడు కేసీఆర్ వచ్చి తమ పూర్వీకుల ఊరు అని చెప్పి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు… ఊరిమీద పడి రక్తం తాగే పులిని చంపడానికి వేటగాడిని తీసుకొచ్చినట్లు… కామారెడ్డిపై పడి మీ భూములు కాజేయాలని చూస్తున్న కేసీఆర్ ను వేటాడటానికి నన్ను అధిష్టానం ఇక్కడికి పంపింది. పేదల రక్తం రుచి మరిగిన కేసీఆర్ ను కామారెడ్డి పొలిమేరలకు తరమడానికే నేను ఇక్కడ పోటీ చేస్తున్నా. కామారెడ్డిలో మీ భూములను కాపాడే బాధ్యత నాది. కేసీఆర్ ఉద్యోగం ఊడగొడితేనే మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం కేసీఆర్ వస్తే మీ భూములు పోతాయ్.. మీ పిల్లలకు ఉద్యోగాలు రావు.. అడవిపందుల నుంచి పంటను కాపాడుకున్నట్లు… మీ ఓట్ల కంచెతో కామారెడ్డిని కాపాడుకునే బాధ్యత మీది. మీరు అండగా ఉంటే కేసీఆర్ తాత వచ్చినా కామారెడ్డిలో కాలు పెట్టకుండా చూసుకునే బాధ్యత నాది’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read
- Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. 'నా వ్యాఖ్యల్లో తప్పు లేదు'..!
- Pakistan Minister: "చేతులు నరికేస్తాం".. సింధు జలాల విషయంలో భారత్‌కు పాక్ మంత్రి వార్నింగ్!
- Astrology: జూన్ 30 సోమవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
తాజావార్తలు
-
Aarogya Setu 2.0: ఆరోగ్య సేతు 2.0 వచ్చేసింది!.. నిమిషాల్లో OPD బుకింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్..!
-
Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. ‘నా వ్యాఖ్యల్లో తప్పు లేదు’..!
-
Pakistan Minister: “చేతులు నరికేస్తాం”.. సింధు జలాల విషయంలో భారత్‌కు పాక్ మంత్రి వార్నింగ్!
-
Janhvi Kapoor: టాలీవుడ్ తర్వాత కోలీవుడ్‌పై ఫోకస్.. భారీ వెబ్ సిరీస్‌తో జాన్వీ కపూర్ డిజిటల్ ఎంట్రీ!
-
Vastu Tips: మనీ ప్లాంట్‌ను ఈ దిశలో పెడితే ధన యోగం వస్తుందా?.. వాస్తు నిపుణులు చెప్పే సూచనలు ఇవే
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్‌ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!