CM Revanth Reddy : మీరు ఇచ్చిన స్ఫూర్తితో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలోని గుర్మిట్కల్ ఎన్నికల ప్రచార సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇక్కడి నుంచి తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా ఖర్గే కొనసాగారని, 1972లో మొదటిసారిగా మీరు ఎన్నుకున్న మల్లికార్జున ఖర్గే… ఏఐసీసీ అధ్యక్షుడుగా ఇప్పుడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన అన్నారు. గుర్మిట్కల్ ప్రజల ఆశీర్వాదం వల్లే ఆయన ఈ స్థాయికి చేరుకున్నారని, మీరు ఇచ్చిన స్ఫూర్తితో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ఐదు గ్యారంటీలను అమలు చేసిన ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వమని, తెలంగాణలోనూ ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేసుకున్నామన్నారు రేవంత్ రెడ్డి. పదేళ్లలో మోదీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయలేదని, నల్లధనాన్ని తెచ్చి ప్రజల ఖాతాల్లో వేస్తామని మోదీ మోసం చేశారన్నారు రేవంత్ రెడ్డి.
అంతేకాకుండా..’40కోట్ల ఖాతాలు తెరిపించిన మోదీ… ఒక్క పైసా కూడా పేదల ఖాతాల్లో వేయలేదు.. కర్ణాటక నుంచి 26ఎంపీలను ఇస్తే… మోదీ కర్ణాటకకు ఇచ్చింది ఒకటే కేబినెట్ పదవి.. మోడీ కర్ణాటకకు ఇచ్చింది ఏమీ లేదు.. ఖాళీ చెంబు తప్ప.. కరువు వస్తే కనీసం బెంగుళూరుకు నీళ్లు కూడా ఇవ్వలేదు.. నరేంద్ర మోడీ ప్రజలను నమ్మించి మోసం చేశారు… అలాంటి మోదీని ఓడించాల్సిన అవసరం ఉంది.. ప్రజలకు అండగా ఉండే కాంగ్రెస్ ను గెలిపించుకోవాలి.. సమర్ధుడు, మీ కోసం కొట్లాడే వారికే ఓటువేసి గెలిపించండి… ఇక్కడ కాంగ్రెస్ కు ఒక్క ఓటు వేస్తే… ఇక్కడున్న ముగ్గురు నాయకులు మీకు సేవ చేస్తారు.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేసేందుకే మోదీ 400 సీట్లు కావాలంటున్నారు.. రిజర్వేషన్లు కావాలనుకుంటే కాంగ్రెస్ కు ఓటు వేయండి.. ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ ను గెలిపించండి… లక్ష మెజారిటీతో ఇక్కడ కాంగ్రెస్ ను గెలిపించండి…’ అని రేవంత్ రెడ్డి కోరారు.
Also Read
తాజావార్తలు
-
RBI: రూపాయికి కొంత ఉపశమనం.. ఆర్బీఐ చర్యలతో భారీ ఊరట..
-
Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
-
Snowfall: దేశమంతా ఎండలు భగభగలు.. లడఖ్‌లో మాత్రం భారీ హిమపాతం.. వీడియోలు వైరల్
-
SIR Phase-3 : దేశవ్యాప్తంగా ‘SIR ఫేజ్-3’ షెడ్యూల్ విడుదల, అక్టోబర్ 1న తుది జాబితా..!
-
AP: ఏపీ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన కమిటీ నియామకం..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!