Site icon NTV Telugu

Venkateswara Rao: జగన్‌పై దాడి కేసు.. పోలీసుల దెబ్బలకు నేటికీ అన్నం తినలేని పరిస్థితిలో బాధితులు..!

Ab Venkateswara Rao

Ab Venkateswara Rao

జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటన కేసులో నిందితుడు సతీష్ కుటుంబ బాధితులను రిటైర్డ్ ఐపీఎస్ వెంకటేశ్వరరావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడు. మనుషుల్ని వాళ్ళ జీవితాల్ని తొక్కుకుంటూ రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు వైఖరికి సతీష్ పై పెట్టిన కేసు ఒక తార్కాణమని ఎద్దేవా చేశారు. పేద వడ్డెర కులస్తుడైన సతీష్ పై అక్రమ కేసు బనాయించి అతని జీవితాన్ని, కుటుంబాన్ని నాశనం చేశారన్నారు. గజమాల వేసినప్పుడు తగిలిన దెబ్బను అప్పటికప్పుడు రాయి దాడిగా చిత్రీకరించి రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకున్నారన్నారు. బలహీనుడు
కాబట్టి సతీష్ ను బలి చేశారని, 45 రోజులు సతీష్ ను జైలులో పెట్టారని చెప్పారు.

READ MORE: IPL History: ఐపీఎల్ చరిత్రలో 20వ ఓవర్‌ను మెయిడెన్‌ చేసిన అతి భీకర బౌలర్స్ ఎవరో తెలుసా..?

ప్రభుత్వం మారాక కూడా తప్పుడు కేసును కొట్టివేయకుండా నేటికి తిప్పుతున్నారని రిటైర్డ్ ఐపీఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇవాళ్టి వరకు ఆ కేసులో ఎటువంటి పురోగతి లేదన్నారు. వాళ్లపై ఏ రకమైన థర్డ్ డిగ్రీ ప్రయోగించారు వింటే గుండె తరుక్కుపోతుందన్నారు. సతీష్ తో పాటుగా, దుర్గారావును సైతం ఇబ్బందులు పెట్టారని చెప్పారు. రూ. 2 లక్షలు డబ్బులు ఇస్తామని, టీడీపీ వాళ్ళే దాడి చేయించారని ఒప్పుకో మంటూ మభ్యపెట్టినట్లు ఆరోపించారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు, నేటికి అన్నం తినలేని పరిస్థితిలో బాధితులు ఉన్నారన్నారు. ఇంత దుర్మార్గం చేసిన పోలీసులపై ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఇటువంటి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసు లో బాధితులను బలి చేసిన బాధ్యులపై ప్రభుత్వం, సీపీ, డీజీపీ చర్యలు తీసుకోవాలన్నారు.

READ MORE: Ambati Rambabu: సీఎం చంద్రబాబుకు కాపులు అంటే ఎందుకంత కోపం..?

Exit mobile version