Venkateswara Rao: జగన్‌పై దాడి కేసు.. పోలీసుల దెబ్బలకు నేటికీ అన్నం తినలేని పరిస్థితిలో బాధితులు..!
- బలహీనుడు కాబట్టి సతీష్ ను బలి చేశారు, 45 రోజులు సతీష్ ను జైలులో పెట్టారు
- ప్రభుత్వం మారాక కూడా తప్పుడు కేసు ను కొట్టివేయకుండా నేటికి తిప్పుతున్నారు
- ఇవాళ్టి వరకు ఆ కేసు లో ఎటువంటి పురోగతి లేదు
- వాళ్లపై ఏ రకమైన థర్డ్ డిగ్రీ ప్రయోగించారు వింటే గుండె తరుక్కుపోతుంది
- సతీష్ కుటుంబ బాధితులను పరామర్శించిన రిటైర్డ్ ఐపీఎస్ వెంకటేశ్వరరావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటన కేసులో నిందితుడు సతీష్ కుటుంబ బాధితులను రిటైర్డ్ ఐపీఎస్ వెంకటేశ్వరరావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడు. మనుషుల్ని వాళ్ళ జీవితాల్ని తొక్కుకుంటూ రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు వైఖరికి సతీష్ పై పెట్టిన కేసు ఒక తార్కాణమని ఎద్దేవా చేశారు. పేద వడ్డెర కులస్తుడైన సతీష్ పై అక్రమ కేసు బనాయించి అతని జీవితాన్ని, కుటుంబాన్ని నాశనం చేశారన్నారు. గజమాల వేసినప్పుడు తగిలిన దెబ్బను అప్పటికప్పుడు రాయి దాడిగా చిత్రీకరించి రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకున్నారన్నారు. బలహీనుడు
కాబట్టి సతీష్ ను బలి చేశారని, 45 రోజులు సతీష్ ను జైలులో పెట్టారని చెప్పారు.
READ MORE: IPL History: ఐపీఎల్ చరిత్రలో 20వ ఓవర్‌ను మెయిడెన్ చేసిన అతి భీకర బౌలర్స్ ఎవరో తెలుసా..?
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
ప్రభుత్వం మారాక కూడా తప్పుడు కేసును కొట్టివేయకుండా నేటికి తిప్పుతున్నారని రిటైర్డ్ ఐపీఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇవాళ్టి వరకు ఆ కేసులో ఎటువంటి పురోగతి లేదన్నారు. వాళ్లపై ఏ రకమైన థర్డ్ డిగ్రీ ప్రయోగించారు వింటే గుండె తరుక్కుపోతుందన్నారు. సతీష్ తో పాటుగా, దుర్గారావును సైతం ఇబ్బందులు పెట్టారని చెప్పారు. రూ. 2 లక్షలు డబ్బులు ఇస్తామని, టీడీపీ వాళ్ళే దాడి చేయించారని ఒప్పుకో మంటూ మభ్యపెట్టినట్లు ఆరోపించారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు, నేటికి అన్నం తినలేని పరిస్థితిలో బాధితులు ఉన్నారన్నారు. ఇంత దుర్మార్గం చేసిన పోలీసులపై ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఇటువంటి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసు లో బాధితులను బలి చేసిన బాధ్యులపై ప్రభుత్వం, సీపీ, డీజీపీ చర్యలు తీసుకోవాలన్నారు.
READ MORE: Ambati Rambabu: సీఎం చంద్రబాబుకు కాపులు అంటే ఎందుకంత కోపం..?
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి