IPL History: ఐపీఎల్ చరిత్రలో 20వ ఓవర్‌ను మెయిడెన్ చేసిన అతి భీకర బౌలర్స్ ఎవరో తెలుసా..?
- IPL చరిత్రలో 20వ ఓవర్‌ను మెయిడెన్‌గా వేసిన బౌలర్లు
- ఇప్పటివరకు ఐదు మంది మాత్రమే ఈ ఘనతను సాధించారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL History: బ్యాటర్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న ఐపీఎల్ లో ఒక్క ఓవర్ మెయిడెన్ చేయడమంటే అంత సులువు కాదు. ఇలాంటి మెయిడెన్స్ జరగడం చాలా తక్కువ శాతం ఉంటుంది. అలాంటిది ఇన్నింగ్స్ చివరి ఓవర్ అంటే 20వ ఓవర్‌ను మెయిడెన్ చేయడమంటే అంత సులువు కాదు. చివరి ఓవర్ లో ఎలాగైనా పరుగులు రాబట్టలని చూసే బ్యాటర్స్ ను అడ్డుకొని మెయిడెన్ చేసిన బౌలర్లు ఉన్నారని మీకు తెలుసా..?
నిజానికి ఐపీఎల్ చరిత్రలో 20వ ఓవర్‌ను మెయిడెన్‌గా ముగించటం ఒక అరుదైన ఘటన. బాగా ఒత్తిడిలో ఉండే ఈ చివరి ఓవర్‌లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మెయిడెన్ వేసిన బౌలర్లు ఉన్నారు. ఇలా ఇప్పటివరకు ఐపీఎల్ లో ఈ ఘనతను సొంతం చేసుకున్న వారు ఐదుగురు మాత్రమే. మరి ఆ బౌల్వెర్స్ ఎవరో ఒకసారి చూసేద్దామా..
Also Read
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
Read Also: IPL 2025 Final: వర్షం కారణంగా ఫైనల్ రద్దయితే.. నెక్స్ట్ ఏంటి..? రిజర్వ్ డే ఉందా..?
ఈ ఘనతను పొందిన తొలి బౌలర్ ఇర్ఫాన్ పఠాన్. 2008లో కింగ్స్ XI పంజాబ్ తరఫున ముంబై ఇండియన్స్‌పై జరిగిన మ్యాచ్‌లో 20వ ఓవర్‌ను మెయిడెన్‌గా ముగించి తన జట్టుకు 66 పరుగుల తేడాతో విజయం సాధించడంలో సహాయపడ్డాడు. అనంతరం, 2009లో ముంబై ఇండియన్స్ తరఫున లసిత్ మలింగా డెక్కన్ ఛార్జర్స్‌పై 20వ ఓవర్‌లో రెండు వికెట్లు తీయడంతో పాటు మెయిడెన్ ఓవర్ వేసాడు.
Read Also: Minister Vasamsetti Subhash: లోకేష్‌తో జగన్ పది నిమిషాలు డిబేట్‌లో కూర్చోగలరా..?
ఆ తర్వాత జయదేవ్ ఉనద్కత్ 2017లో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ తరఫున సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 20వ ఓవర్‌లో హ్యాట్రిక్ సాధించి, ట్రిపుల్ వికెట్ మెయిడెన్ బౌలింగ్ చేశాడు. ఇది మ్యాచ్‌ను తక్కువ స్కోరుతోనే గెలవడానికి కీలకంగా మారింది. ఆ తర్వాత 2022లో భారత దేశ యువ స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున పంజాబ్ కింగ్స్‌పై 20వ ఓవర్‌లో మూడు వికెట్లు తీయడంతో పాటు మెయిడెన్ ఓవర్ వేసి, తన దూకుడు చూపించాడు.
అలాగే 2023లో మహీష్ తీక్షన చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఢిల్లీ క్యాపిటల్స్ పై 20వ ఓవర్‌ను మెయిడెన్‌గా ముగించాడు. ఇక్కడ విశేషం ఏంటంటే.. అతను ఈ ఘనతను సాధించిన తొలి స్పిన్నర్ కావడం. ఈ ఐదుగురు బౌలర్లు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఒత్తిడిలోనూ మెయిడెన్ బౌలింగ్ చేస్తూ తమ జట్లకు విజయాల్లో కీలక పాత్ర పోషించారు.
తాజావార్తలు
-
OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!