Renu Desai: నెటిజన్ల అసభ్య కామెంట్స్‌పై రేణూ దేశాయ్ నిప్పులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటి, సామాజిక కార్యకర్త రేణూ దేశాయ్ (Renu Desai) సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్నాళ్లుగా తన వ్యక్తిగత జీవితంపై, రాజకీయ అభిప్రాయాలపై వస్తున్న అసభ్యకరమైన కామెంట్స్ పట్ల ఆమె విరుచుకుపడ్డారు. ముఖం చూపించే ధైర్యం లేక ఫేక్ అకౌంట్లతో దూషిస్తున్న వారిని వెతికి పట్టుకుని మరీ బుద్ధి చెబుతానని ఆమె ఇన్ స్టా వేదికగా హెచ్చరించారు.
Also Read : Vijay-Rashm : పెళ్లి చేసుకున్న ఆనందంలో ‘విరోష్’ అదిరిపోయే నిర్ణయం..
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్‌కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
జనవరిలో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో వీధి కుక్కల సంరక్షణ గురించి తాను చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా చిత్రీకరించారని ఆమె మండిపడ్డారు. ఒక చిన్నారి మరణించిన ఘటనకు తన పాత వీడియోను ఎడిట్ చేసి అటాచ్ చేయడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను విడాకులు తీసుకున్నప్పటి నుండి నా భరణం గురించి, నా వ్యక్తిగత విషయాల గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. నేను వీధి కుక్కల సంరక్షణ కోసం ఎన్జీవో నడుపుతున్నాను.. మనుషుల కోసం కాదు. నన్ను తిట్టడానికి మీకు ఏ హక్కు లేదు’ అని ఆమె స్పష్టం చేశారు. దూషించే వ్యక్తులకు వార్నింగ్ ఇస్తూ.. ‘మీరు చేసే పనులు మీ ఇంట్లో అమ్మానాన్నలకు, అక్కాచెల్లెళ్లకు చూపించగలరా? ఇకపై ఇలాంటి పనులు చేసే వారిని గుర్తించి, వారి ఇంటికి వెళ్లి మరీ వాళ్ల తల్లిదండ్రుల ముందు మీ దుర్మార్గాలను ఎండగడతాను’ అని రేణూ దేశాయ్ హెచ్చరించారు. సోషల్ మీడియాను కేవలం ఇతరులను కించపరచడానికి వాడటం ఎంత వరకు సంస్కారమని ఆమె ప్రశ్నించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఆమె డెసిషన్‌కు పలువురు మద్దతు తెలుపుతున్నారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్‌గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్‌ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!