Renault, Nissan Vehicles: ఉమ్మడిగా వాహనాలను ఉత్పత్తి చేయనున్న రెనాల్ట్, నిస్సాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Renault, Nissan Vehicles: ఇటీవలే ఒక్కటైన రెండు కార్ల తయారీ సంస్థలు రెనాల్ట్ మరియు నిస్సాన్.. తమ ఫస్ట్ జాయింట్ ప్రాజెక్ట్ వివరాలను వెల్లడించాయి. ఇండియాలో చేపట్టనున్న విస్తరణ ప్రణాళికను కూడా ప్రకటించాయి. ఇందులో భాగంగా 600 మిలియన్ డాలర్ల పెట్టుబడితో చెన్నైలోని మ్యానిఫ్యాక్షరింగ్ ప్లాంట్‌ని డీకార్బనైజ్ చేయనున్నాయి.
కొత్త మోడల్ కార్ల తయారీ ద్వారా దాదాపు 2 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నాయి. ఈ రెండు సంస్థలు కలిసి ఆరు కొత్త వాహనాలను ఉత్పత్తి చేయనున్నాయి. ఇందులో భాగంగా రెండు విద్యుత్ కార్లను మరియు నాలుగు SUVలను రూపొందిస్తాయి. మన దేశంలోని వినియోగదారులతోపాటు దక్షిణాసియా దేశాలు మరియు ఇతర విదేశాలకు ఎగుమతులు లక్ష్యంగా కూడా ఈ వెహికిల్స్‌ని మార్కెట్‌లోకి తీసుకురానున్నాయి.
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
read more: Companies Names-Full Forms: మనకు తెలియని 40 ఆసక్తికరమైన అంశాలు
ఈ రెండు కంపెనీలు చెరో మూడు చొప్పున ఆరు వాహనాలను రూపొందించి ఉత్పత్తి చేయనున్నాయి. చెన్నైలోని కార్ల తయారీ ప్లాంట్‌ని 2045 నాటికి కార్బన్ న్యూట్రల్‌గా తీర్చిదిద్దుతాయి. ఇదిలా ఉండగా.. ఈ రెండు సంస్థలు విలీనమయ్యేందుకు ఏర్పాటుచేసుకున్న ఒప్పందం ప్రకారం.. నిస్సాన్ సంస్థలోని వాటాను రెనాల్ట్ కంపెనీ భారీగా తగ్గించుకోనుంది.
గతంలో 43 శాతం షేరును కలిగి ఉండగా భవిష్యత్తులో 15 శాతంతో సరిపెట్టుకోనుంది. దీనికి ప్రతిఫలంగా నిస్సాన్.. రెనాల్ట్ ఎలక్ట్రిక్ వెహికిల్ యూనిట్‌లో పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు సోమవారం ఉమ్మడిగా ప్రకటన చేశాయి. రెనాల్ట్ మరియు నిస్సాన్ వెల్లడించిన ఈ ఫస్ట్ జాయింట్ ప్రాజెక్టు ఇండియాలోనే కాకుండా గ్లోబల్ మోటర్ సెక్టార్‌లో సైతం కీలకమైన పరిణామంగా నిపుణులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!