Renault, Nissan Vehicles: ఇటీవలే ఒక్కటైన రెండు కార్ల తయారీ సంస్థలు రెనాల్ట్ మరియు నిస్సాన్.. తమ ఫస్ట్ జాయింట్ ప్రాజెక్ట్ వివరాలను వెల్లడించాయి. ఇండియాలో చేపట్టనున్న విస్తరణ ప్రణాళికను కూడా ప్రకటించాయి. ఇందులో భాగంగా 600 మిలియన్ డాలర్ల పెట్టుబడితో చెన్నైలోని మ్యానిఫ్యాక్షరింగ్ ప్లాంట్‌ని డీకార్బనైజ్ చేయనున్నాయి. కొత్త మోడల్ కార్ల తయారీ ద్వారా దాదాపు 2 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నాయి. ఈ రెండు సంస్థలు కలిసి ఆరు కొత్త వాహనాలను ఉత్పత్తి చేయనున్నాయి.