AP: ఏపీలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల..పోలింగ్ ఎప్పుడంటే?
- సీ. రామచంద్రయ్యపై అనర్హత వేటు
- షేక్ మహ్మద్ ఇక్బాల్ రాజీనామా నేపథ్యంలో సీట్లు ఖాళీ
- ఈ నెల 25 నోటిఫికేషన్ విడుదల
- జూలై 2 తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ
- జులై 12 తేదీన పోలింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక షెడ్యూలు విడుదలైంది. ఈ నెల 25 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. నామినేషన్ల దాఖలుకు జూలై 2 తేదీ తుది గడువుని పేర్కొంది. నామినేషన్ల ఉపసంహరణకు జూలై 5 తేదీ వరకు తుది గడువిచ్చింది. జులై 12 తేదీన ఎన్నికలు జరుగుతాయని నోటిఫికేషన్లో పేర్కొన్న పేర్కొంది ఈసీ. సీ. రామచంద్రయ్యపై అనర్హత వేటు, షేక్ మహ్మద్ ఇక్బాల్ రాజీనామా నేపథ్యంలో ఈ రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. 2021లో వైసీపీ టికెట్‌పై ఎమ్మెల్సీగా గెలిచి, ఈ ఏడాది మార్చిలో తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించినందుకుగాను ఆయనపై అనర్హత వేటు పడింది. వైసీపీ నుంచి గెలిచిన ఇక్బాల్.. ఆ పార్టీకి రాజీనామా చేసి, ఏప్రిల్‌లో టీడీపీలో చేరారు. అనంతరం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ ఇద్దరి పదవీకాలం 2027 మార్చి 29 వరకు ఉంది.
READ MORE: Darshan: లవర్ పవిత్రకు 3 అంతస్తుల ఇల్లు.. కానీ 1BHK అద్దె ఇంట్లో దర్శన్ సోదరుడు!!
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికకు సంబంధించి 12న పోలింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకనటలో పేర్కొంది. ఏపీ అసెంబ్లీలో ఎన్డీయే కూటమికి 164 మంది సభ్యుల మద్దతు ఉన్న నేపథ్యంలో రెండు సీట్లూ కూటమికే దక్కుతాయని పలువురి అభిప్రాయం. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లకు గాను టీడీపీ 135, దాని మిత్రపక్షాలు జనసేన 21, బీజేపీ 8 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. వైసీపీ 11 స్థానాలకు పరిమితమైంది. వైసీపీ రెబల్ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్‌పైనా అనర్హత వేటు పడింది. ఆయన స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ స్థానానికి త్వరలో పోలింగ్ తేదీని ప్రకటించనున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూసిన వైసీపీ తరువాత వచ్చే ఉప ఎన్ని్కల్లో ఎలాగైనా గెలవాలని కసరత్తు చేస్తోంది.
తాజావార్తలు
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
-
Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
-
Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..