West Bengal: పశ్చిమ బెంగాల్ రాయకీయాల్లో ట్విస్ట్.. బీజేపీ ఎంపీని కలిసిన సీఎం మమతా బెనర్జీ
- సీఎంకు ఘన స్వాగతం పలికిన ఎంపీ అనంత్ రాయ్
- ఉత్తర బెంగాల్ రాజకీయాల్లో కీలకంగా మారిన ఎంపీ
- ఏడాది క్రితమే పశ్చిమ బెంగాల్ నుంచి రాయ్ ని రాజ్యసభకు పంపిన బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మంగళవారం ట్విస్ట్ నెలకొంది. ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ నివాసానికి రాష్ట్ర అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేరుకున్నారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ అనంత్ రాయ్ మహరాజ్ సీఎం మమతకు ఘనస్వాగతం పలికారు. మమతా బెనర్జీ, బీజేపీ ఎంపీల భేటీకి సంబంధించిన వార్త పెద్దగా బయటకు రాలేదు. అనంత్ రాయ్ మహారాజ్ ఉత్తర బెంగాల్ రాజకీయాలలో ఒక పెద్ద పాత్ర పోషిస్తున్నారు. ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీ వేగం పెంచేందుకు ఆయన కృషి చేశారు. అనంత్ గ్రేటర్ కూచ్ బెహార్ పీపుల్స్ అసోసియేషన్ (GCPA) అధ్యక్షుడు, ఉత్తర బెంగాల్‌లో కూచ్ బెహార్‌ను ప్రత్యేక గ్రేటర్ కూచ్ బెహార్ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. తనను తాను గ్రేటర్ కూచ్ బెహార్ మహారాజాగా పిలుచుకునే అనంత్‌ను ఏడాది క్రితమే పశ్చిమ బెంగాల్ నుంచి బీజేపీ రాజ్యసభకు పంపింది.
READ MORE: AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఖరారు.. మూడు రోజుల ముందుగానే..!
Also Read
- BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
- Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
పశ్చిమ బెంగాల్ నుంచి బీజేపీ టికెట్‌పై రాజ్యసభకు చేరిన తొలి నాయకుడు అనంత్ కావడం విశేషం. ఇప్పుడు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆయన నివాసానికి చేరుకుని ఆయనను కలిసిన తర్వాత ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. గతేడాది హోంమంత్రి అమిత్ షా అనంత్ నివాసానికి చేరుకుని ఆయనను కలిశారు. ఆ తర్వతే బీజేపీ ఆయనను రాజ్యసభకు పంపిందని వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆయనను కలిసేందుకు సీఎం మమత ఆయన నివాసానికి చేరుకోవడంతో ఇక ఏం జరగనుందన్న ప్రశ్న ఉత్పన్నమైంది. నరేంద్ర మోడీ నేతృత్వంలోని గత ప్రభుత్వంలో సహాయ మంత్రిగా పనిచేసిన నిషిత్ ప్రమాణిక్ కూడా అనంత్‌కు సన్నిహితుడిగా చెబుతుంటారు. నిషిత్ ప్రమాణిక్ కూడా అనంత్ వలె అదే రాజ్‌బన్షి సంఘం నుంచి వచ్చారు.
READ MORE: Minister Satya Kumar Yadav: ఏపీకి దీపావళి ముందే వచ్చింది.. రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచుతాం
పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం షెడ్యూల్డ్ కులాల జనాభాలో రాజ్‌బన్షి కమ్యూనిటీ 18 శాతానికి పైగా ఉన్నారు. రాజ్‌బన్షి కమ్యూనిటీ అనేది షెడ్యూల్డ్ కులాల వర్గంలో అతిపెద్ద, ప్రభావవంతమైన సంఘం. రాజకీయ దృక్కోణంలో, ఉత్తర బెంగాల్‌లోని ఐదు జిల్లాల్లోని 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజ్‌బన్షి కమ్యూనిటీ ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మంచి పనితీరు కనబరిచిన ఈ ఐదు జిల్లాల్లో కూచ్ బెహార్‌తో పాటు, అలీపుర్‌దూర్ కూడా చేర్చబడింది. అయితే 2024 ఎన్నికల్లో కూచ్ బెహార్ లోక్‌సభ స్థానాన్ని ఆ పార్టీ కోల్పోయింది. ప్రస్తుతం ఈ భేటీపై రాష్ట్రంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
తాజావార్తలు
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!