Snoring problems And Remedies : ఈ రోజుల్లో ఎక్కువ మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో గురక ఒకటి. ఇది సాధారణ సమస్యే అయినప్పటికీ దీన్ని లైట్ తీసుకుంటే ఇబ్బందే. గురక వల్ల మన పక్కన పడుకున్న వారు అసౌకర్యానికి గురవుతారు. వారికి సరిగా నిద్రపట్టదు. అసలు ఈ గురక ఎందుకు వస్తుంది? ఏం చేస్తే గురక సమస్య తగ్గుతుందో తెలుసుకుందాం.
గురక రావడానికి కారణాలు: నిద్రిస్తున్న సమయంలో శ్వాస తీసుకునేటప్పుడు వోకల్ కార్డులను వైబ్రేట్ చేయడం వల్ల సమస్య వస్తుంది. నిద్రించే సమయంలో ముక్కు, నోటి నుంచి గాలి ఫ్రీగా వెళ్లకపోవడం గురకకు ముఖ్యమైన కారణంగా చెప్పొచ్చు. కొన్ని రకాల అలర్జీలు, అడినాయిడ్స్ ఇన్ఫెక్షన్లు, ముక్కు లోపలి భాగం వాచిపోవడం, శ్వాస మార్గానికి అడ్డుపడటం లాంటివి కూడా గురక సమస్యకు కారణం అవుతాయి. మనం తీసుకునే గాలి ఎక్కువవుతున్న కొద్దీ ఈ సౌండ్ క్రమంగా పెద్దది అవుతుంది. వయస్సుతో సంబంధం లేకుండా ప్రస్తుతం గురక చాలా మందికి వస్తోంది. పిల్లల్లో ఎడినాయిడ్ సమస్య సర్వసాధారణంగా మారిపోయింది. దీని వల్ల నోరు తెరచి నిద్రపోవడం వల్ల గురక వస్తుంది. మధ్య వయస్కుల్లో ఎక్కువగా ఊబకాయం వల్ల గురక సమస్య వస్తోంది. అయితే పెద్దవారిలో మాత్రం శరీరంలోని ఇతర కండరాలు బలహీనపడినట్లే మెడ కండరాలు కూడా బలహీనంగా తయారవుతాయి. అందుకే వాళ్లు శ్వాస తీసుకున్నప్పుడు బాగా గురక వస్తుంది. అంతేకాకుండా శ్వాసనాళ సమస్యలు, సైనస్, ధూమపానం, మద్యం సేవించడం కూడా గురకకు కారణమవుతాయి.
Also read: Problems with Pillow : దిండు లేకుండా పడుకోలేరా? అయితే ఈ సమస్యలు రావచ్చు!
పాటించాల్సిన చిట్కాలు: కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. ఒక గ్లాసు నీటిలో ఒకటి లేదా రెండు పిప్పర్మెంట్ ఆయిల్ చుక్కలు వేసి రాత్రి నిద్రపోయే ముందు నోటిలో వేసుకొని పుక్కిలించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నెయ్యిని ఉపయోగించడం వల్ల కూడా గురకకు చెక్ పెట్టవచ్చు. అది మూసుకుపోయిన ముక్కు రంధ్రాలను ఫ్రీ చేసి గురకను నియంత్రిస్తుంది. ప్రతిరోజూ పడుకునే ముందు అర టీస్పూన్ యాలకుల పొడిని వేడి నీటిలో కలిపి తాగడం కూడా ఈ సమస్య పరిష్కారమవుతుంది. ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్నవారు వెంటనే వాటిని వదిలేయాలి. అధిక బరువు ఉన్న వారు దానిని అదుపులో ఉంచుకోవాలి. మెడ చుట్టూ నల్లని కొవ్వు పేరుకోకుండా చూసుకోవాలి.