Model Pooja Sarkar: బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడాక మోడల్ ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Model Pooja Sarkar Dies By Suicide After Boyfriend Call: ఈమధ్య కాలంలో చిత్రసీమలో తరచూ విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆత్మహత్య ఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా కోల్‌కతాకు చెందిన పూజా సర్కార్ (21) అనే మోడల్ సూసైడ్ చేసుకుంది. తాను అద్దెకు ఉంటోన్న ఇంట్లో ఉరివేసుకొని, బలవన్మరణానికి పాల్పడింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
నార్త్ 24 పరగణాస్ జిల్లాలో పూజా సర్కార్ మొదటి సంవత్సరం చదువుతోంది. కోల్‌కతాలోని బాన్స్‌ద్రోని ప్రాంతంలో నివసిస్తున్న ఈ అమ్మాయి.. శనివారం (జులై 16) సాయంత్రం తన స్నేహితులతో కలిసి ఒక రెస్టారెంట్‌కు వెళ్లింది. పార్టీ చేసుకున్న తర్వాత అందరూ తిరిగి వచ్చేశారు. అప్పుడు పూజాకి బాయ్‌ఫ్రెండ్ నుంచి కాల్ వచ్చింది. అతనితో మాట్లాడిన తర్వాత పూజా పరిగెత్తుకుంటూ తన గదిలోకి వెళ్లి, లోపల నుంచి గెడియ పెట్టేసుకుంది. దాంతో భయపడిపోయిన ఆమె స్నేహితులు, తలుపు తీయమని డోర్ కొట్టారు. ఎంత ప్రయత్నించినా ఆమె డోర్ తీయకపోవడంతో, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
Also Read
- Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
- Tollywood: 'లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..' టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
- Vicky Kaushal - Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ - ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
- Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
రంగంలోకి దిగిన పోలీసులు.. తలుపు బద్దలుకొట్టి చూడగా, పూజా విగతజీవిగా కనిపించింది. ఆమె సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే.. ఆమె చనిపోవడానికి ముందు తన బాయ్‌ఫ్రెండ్‌తో ఫోన్‌లో మాట్లాడిందని పూజా స్నేహితులు తెలిపారు. దీంతో.. ఆమె సూసైడ్‌కి అదే ప్రధాన కారణం అయి ఉండొచ్చని, ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగి ఉంటుందని, ఆ బాధలోనే పూజా ఈ కఠిన నిర్నయం తీసుకొని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని, విచారణ చేస్తున్నారు. పూజా ఆత్మహత్య వార్త విని, ఆమె తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
కాగా.. గత మూడు నెలల్లో ముగ్గురు మోడల్స్ సూసైడ్ చేసుకున్నారు. మే 24వ తేదీన బిదిషా డే మజుందార్ అనే మోడల్ తన ఫ్లాట్‌లోనే ఉరి వేసుకొని చనిపోగా.. ఆమె స్నేహితురాలు, మోడల్ అయిన మంజుషా నియోగి కూడా అదే నెలలో 27న పటులిలో సూసైడ్ చేసుకుంది. సరైన అవకాశాలు లేకపోవడం, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టేయడంతో పాటు రిలేషన్‌షిప్ దెబ్బతినడం వల్లే ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు పూజా సర్కారు సైతం రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ వల్లే సూసైడ్ చేసుకొని ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
-
Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
-
Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు