Jio 8th Anniversary Offers: దేశీయ టెలికాం దిగ్గజం ‘రిలయన్స్ జియో’ 8వ వార్షికోత్సవం సందర్భంగా తన యూజర్ల కోసం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. కొన్ని రీఛార్జీలపై రూ.700 విలువ చేసే ప్రయోజనాలు అందిస్తున్నట్లు కంపెనీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. సెప్టెంబర్ 5 నుంచి 10 లోపు రీఛార్జి చేసుకున్న వారికి మాత్రమే ఈ బెనిఫిట్స్ వర్తిస్తాయి. ఈ ఆఫర్ల వివరాలను ఓసారి తెలుసుకుందాం.
జియో అందిస్తున్న రూ.700 విలువ చేసే ప్రయోజనాలు మూడు రీఛార్జి ప్లాన్‌లకు మాత్రమే వర్తిస్తాయి. రూ.899, రూ.999, రూ.3599 ప్లాన్‌లకు మాత్రమే బెనిఫిట్స్ వర్తిస్తాయి. సెప్టెంబర్ 5 నుంచి 10వ తేదీ మధ్య ఎవరైతే ఈ మూడు ప్లాన్‌ను రిచార్జ్ చేసుకుంటారో వారికి రూ.700 విలువైన ప్రయోజనాలను అందుతాయి. వీటిలో రూ.175 విలువైన వోచర్, 10 ఓటీటీ ప్లాట్‌ఫామ్ సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనాలు, ఉచిత జొమాటో 3 నెలల గోల్డ్ మెంబర్‌షిప్ ఉన్నాయి. అదనంగా రూ.500 విలువైన అజియో వోచర్ ఉంది. రూ.2,999 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో అజియోలో కొనుగోలు చేసినప్పుడు ఈ కూపన్ వర్తిస్తుంది.
రూ.899 ప్లాన్:
రూ.899 ప్లాన్‌లో 90 రోజల వ్యాలిడిటీ ఉంటుంది. రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు పొందొచ్చు. అంతేకాదు 20జీబీ డేటా అదనం.
రూ.999 ప్లాన్:
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 98 రోజులు. ఈ రీఛార్జిపై రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.
రూ.3,599 ప్లాన్:
రూ.3,599 ప్లాన్ గడువు 365 రోజులు. రోజూ 2.5జీబీ డాటాను వాడుకోవచ్చు. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత కాలింగ్ వాడుకోవచ్చు.