తమిళ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్ హీరోల్లో థల అజిత్ కుమార్ క్రేజ్ ఎలాంటిదో చెప్పక్కర్లేదు భాషతో సంబంధం లేకుండా ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. ఇక ఈ ఏడాదిలోనే వరుసగా రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అజిత్, ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్‌కు కొంత బ్రేక్ తీసుకున్నాడు. ఇటీవల తన పర్సనల్ ఇంట్రెస్ట్ అయిన రేసింగ్‌పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్న అజిత్, మరోవైపు మాత్రం నెమ్మదిగా నెక్ట్స్ సినిమా పనులను ముందుకు తీసుకెళ్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
Also Read :Rajinikanth : రజినీ కాంత్ కోసం అన్నం మానేసిన హీరోయిన్.. మరీ ఇంత ప్రేమా?
ఇక ఈ నెక్ట్స్ మూవీ లో యంగ్ హీరోయిన్ రెజీనా కాసాండ్రా పేరు బలంగా వినిపించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే అజిత్‌తో కలిసి రెజీనా ‘విడా ముయర్చి’ సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఆమె నెగటివ్ షేడ్ ఉన్న కీలక పాత్రలో కనిపించి తన నటనతో మంచి మార్కులు కొట్టింది. ఇప్పుడు మరోసారి అజిత్‌తో కలిసి నటించే ఛాన్స్ ఆమెకు దక్కినట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో రెజీనా పూర్తి స్థాయి హీరోయిన్గా నటిస్తుందా? లేక కథకు కీలకమైన మరో పాత్రలో కనిపిస్తుందా? అన్నది ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాను కూడా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్నే తెరకెక్కించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఈ కాంబినేషన్ మళ్లీ వర్కౌట్ అయితే అజిత్ అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనలైజేషన్ దశలో ఉన్న ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా, రెజీనా ఎంట్రీపై క్లారిటీ వస్తే ఈ ప్రాజెక్ట్‌పై హైప్ మరింత పెరగడం ఖాయం.