Redmi Watch Move: 2.07 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 24 రోజుల బ్యాటరీ లైఫ్తో రెడ్‌మీ నుంచి రాబోతున్న మరో స్మార్ట్‌వాచ్!
- Redmi Watch Move ను ఏప్రిల్ 21న భారత మార్కెట్లో విడుదల చేయనున్న రెడ్‌మీ (Redmi).
- AMOLED డిస్‌ప్లేతో పాటు అద్భుత ఫీచర్లతో రాబోతున్న Redmi Watch Move.
- "Your Next Big Move" అనే ట్యాగ్‌లైన్‌తో రెడ్‌మీ స్మార్ట్‌వాచ్ ప్రొమోట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Redmi Watch Move: రెడ్‌మీ (Redmi) చైనా టెక్ దిగ్గజం షియోమీ (Xiaomi)కి చెందిన సబ్-బ్రాండ్. ఈ కంపెనీ ముఖ్యంగా వినియోగదారులకు ఆకర్షణీయమైన ధరల వద్ద ప్రీమియం ఫీచర్లను అందిస్తూ స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, గాడ్జెట్ల మార్కెట్‌లో తనదైన స్థానం ఏర్పరచుకుంది. ఇకపోతే 2023లో Redmi Watch 5 Active, Watch 5 Lite లాంచ్ చేసిన తరువాత ఇప్పుడు కంపెనీ తదుపరి స్మార్ట్‌వాచ్ అయిన Redmi Watch Move ను ఏప్రిల్ 21న భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. “Your Next Big Move” అనే ట్యాగ్‌లైన్‌తో రెడ్‌మీ ఈ స్మార్ట్‌వాచ్‌ను ప్రొమోట్ చేస్తోంది. ఇది మీ ఫిట్‌నెస్ ప్రయాణాన్ని మెరుగుపరచడానికి, అలాగే లైఫ్‌స్టైల్స్‌కు అనుగుణంగా డిజైన్ చేసిన ఫీచర్ రిచ్ వాచ్‌గా ఉండబోతున్నట్లు కంపెనీ చెబుతోంది.
Read Also: CMF Phone 2: మరోమారు అద్భుత ఆవిష్కరణకు సిద్దమైన CMF.. కొత్త ఫోన్ లాంచ్కు డేట్ లాక్
Also Read
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్‌పోర్టు మసీదు తరలింపు.!
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్‌కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
ఇందులో AMOLED డిస్‌ప్లే ఉండబోతుందన్న విషయం కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. విడుదల చేసిన టీజర్ ప్రకారం, ఈ వాచ్‌కు కర్వుడ్ స్క్రీన్, అలాగే కుడివైపులో సింగిల్ బటన్ ఉండేలా డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది. ఇక రాబోయే స్మార్ట్‌వాచ్ లోని ప్రధాన ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 2.07 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 1500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో ఉండనునన్నట్లు సమాచారం. ఇందులో 5-సిస్టమ్ GNSS ఇంటిగ్రేషన్, అల్యూమినియం అలాయ్ ప్రీమియం ఫ్రేమ్, బ్లూటూత్ ఫోన్ కాల్ సపోర్ట్, డ్యూయల్ మైక్ నాయిస్ రిడక్షన్, లినియర్ మోటార్, ఒకే చార్జ్‌తో 24 రోజుల బ్యాటరీ లైఫ్ ఉండనున్నట్లు సమాచారం.
ఇప్పటికే టీజర్ విడుదల కావడంతో ఈ వాచ్‌కు సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్లు, ధర, అదనపు ఫీచర్లు అతి త్వరలో తెలియనున్నాయి. ఏప్రిల్ 21న అధికారికంగా విడుదలయ్యే ఈ వాచ్ గురించి పూర్తి సమాచారం త్వరలో అందుబాటులోకి రానుంది. రాబోయే Redmi Watch Move డిజైన్, ఫీచర్లు, లైఫ్‌స్టైల్ ఫోకస్‌తో భారతీయ వినియోగదారులకు ఒక విలువైన ఎంపికగా నిలిచే అవకాశం ఉంది. మీరు ఫిట్‌నెస్ గాడ్జెట్లలో ఆసక్తి ఉన్నవారైతే, ఈ వాచ్ మీకు ఎంతగానో ఉపయోగపడనుంది.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్‌ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?