Site icon NTV Telugu

Redmi 13C 5G: మార్కెట్లోకి రెడ్ మీ స్మార్ట్ ఫోన్.. రేపే లాంచ్..!

Redme 5g

Redme 5g

రెడ్ మీ స్మార్ట్ ఫోన్కు సంబంధించి లాంచింగ్ రేపు (డిసెంబర్ 6న) జరగబోతోంది. అందుకోసం పెద్ద ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో రెడ్ మీ 13C 4G, 5G మోడల్‌లను లాంచ్ చేయనున్నారు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు వర్చువల్ ఈవెంట్‌లో ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఈవెంట్ ను చూడటానికి రెడ్‌మీ ఇండియా అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో చూడవచ్చు. అంతే కాకుండా.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రత్యక్ష ప్రసార ఈవెంట్‌లను చూడవచ్చు. కాగా.. లైవ్ ఈవెంట్‌కు ముందు రెడ్ మీ ప్రత్యేక క్విజ్‌ నిర్వహిస్తుంది. అందులో గెలుపొందిన వారికి స్పెషల్ కూపన్‌లను ఇవ్వనున్నారు.

Read Also: India-Pak: భారతీయ వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు.. పాకిస్తాన్ నుంచి వచ్చిన యువతి..

ఇక.. ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే.. రెడ్ మీ 13C 4G వేరియంట్‌ను రూ. 10,000 ధర ఉండగా.. 5G వేరియంట్ ప్రారంభ ధర రూ. 12 నుండి 15 వేల మధ్య ఉండనుంది. కానీ.. ధరను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయంటే.. రెడ్ మీ 13C 5G స్మార్ట్‌ఫోన్ 6.74 అంగుళాల పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంంది. ఈ స్మార్ట్ ఫోన్ మూడు కలర్లలో వస్తుంది. ఒకటి తెలుపు, నలుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉండనుంది. ఈ ఫోన్ కు 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. అలాగే.. ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉండనుంది. అంతేకాకుండా.. MediaTek Dimension చిప్‌సెట్‌ని ఫోన్‌లో అమర్చారు. ఇక.. రెడ్ మీ 13C 4G స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. రెడ్ మీ 13C 5G మాదిరిగానే ఉండనున్నాయి. అయితే.. చిప్‌సెట్, డిస్‌ప్లే పరంగా మార్పులు ఉండవచ్చు.

Exit mobile version