9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
- డిస్ప్లే: 6.9 అంగుళాల 1.5K 12-bit AMOLED డిస్ప్లే, 185Hz రిఫ్రెష్ రేట్
- ప్రాసెసర్: 3nm Snapdragon 8 Elite Gen 5 మొబైల్ ప్లాట్‌ఫామ్, Adreno 840 GPU
- కెమెరా: 200MP + 50MP + 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, సెల్ఫీ కెమెరా: 32MP ఫ్రంట్ కెమెరా, 4K వీడియో రికార్డింగ్
- బ్యాటరీ: 9,070mAh భారీ బ్యాటరీ, ఛార్జింగ్: 100W వైర్డ్, 50W వైర్లెస్, 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్
- ఆడియో: బోస్ ట్యూన్ చేసిన డ్యూయల్ స్పీకర్లు, ప్రత్యేక సబ్‌వూఫర్
- డ్యూరబిలిటీ: IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
REDMI K100 Pro Max: రెడ్మీ (Redmi) నుండి కొత్తగా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ రెడ్మీ K100 ప్రో మ్యాక్స్ (REDMI K100 Pro Max)ను చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. 9,070mAh బ్యాటరీ, 185Hz రిఫ్రెష్ రేట్ ఉన్న 1.5K AMOLED డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, 200MP కెమెరా వంటి ఫ్లాగ్షిప్ ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది.
AMOLED డిస్ప్లే:
రెడ్మీ K100 ప్రో మ్యాక్స్ లో 6.9 అంగుళాల 1.5K 12-bit AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది 2510 × 1156 పిక్సెల్స్ రిజల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది. డిస్ప్లే 185Hz రిఫ్రెష్ రేట్, 4800Hz ఇన్స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ స్క్రీన్ 4,500 nits వరకు పీక్ బ్రైట్నెస్, HDR10+, డాల్బీ విజన్, DC డిమ్మింగ్ వంటి ఫీచర్లను అందిస్తుంది. అలాగే M11 ల్యూమినసెంట్ మెటీరియల్, రియల్ RGB సూపర్ పిక్సెల్ అరేంజ్‌మెంట్‌ను ఉపయోగించారు. 1% విండోలో గరిష్ఠంగా 10,000 nits బ్రైట్నెస్ను అందించగలదని కంపెనీ పేర్కొంది. ఇందులో కొత్త M11 డిస్ప్లే టెక్నాలజీని ఉపయోగించారు.
Also Read
- 4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
- 200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
- Public Wi-Fi Risks: ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్, హోటళ్లు.. ఇలా పబ్లిక్ Wi-Fiకి కనెక్ట్ అవుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
ప్రాసెసర్ & స్టోరేజ్:
పర్ఫార్మెన్స్ కోసం ఈ స్మార్ట్ ఫోన్ లో 3nm స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు. దీనికి Adreno 840 GPU, Xiaomi D2 డిస్క్రీట్ గ్రాఫిక్స్ చిప్ జత చేశారు. 12GB, 16GB LPDDR5X Ultra RAMతో పాటు 256GB, 512GB, 1TB UFS 4.1 స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ Xiaomi HyperOS 3పై పనిచేస్తుంది. కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు Surge T1+ సిగ్నల్ బూస్టర్‌ను అందించారు. గేమింగ్ కోసం రెడ్మీ రేజ్ ఇంజిన్ ఉండగా, 30కి పైగా గేమ్స్‌లో 185fps నేటివ్ సపోర్ట్ అందిస్తుంది. కొన్ని FPS గేమ్స్‌లో కన్కరెంట్ ఇంటర్పోలేషన్ సపోర్ట్ కూడా ఉంది.
200MP కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్:
ఫోటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో 200MP ప్రధాన కెమెరాను అందించారు. ఇందులో 1/1.56 అంగుళాల S5KHP5 సెన్సార్, f/1.68 అపెర్చర్, OIS, EIS ఉన్నాయి. దీనికి 50MP 102-డిగ్రీ అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP 5x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా జతగా ఉన్నాయి. టెలిఫోటో కెమెరా 30cm టెలిమాక్రోకు కూడా సపోర్ట్ చేస్తుంది. వెనుక కెమెరాతో 8K వీడియో రికార్డింగ్ చేయవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉండగా.. ఇది 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
9,070mAh బ్యాటరీ:
REDMI K100 Pro Maxలో 9,070mAh కెపాసిటీ ఉన్న భారీ బ్యాటరీని అందించారు. ఇది 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అలాగే 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. బ్యాటరీ నిర్వహణ కోసం సర్జ్ G2 చిప్, ఫాస్ట్ ఛార్జింగ్ కోసం సర్జ్ P3 చిప్‌ను ఉపయోగించారు. బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది.

బోస్ ట్యూనింగ్:
ఆడియో విభాగంలో డ్యూయల్ 1115D మాస్టర్-గ్రేడ్ స్పీకర్లను అందించారు. వీటితో పాటు 1620 ఇండిపెండెంట్ సబ్‌వూఫర్‌ను అమర్చారు. ఆడియోను “బోస్” సంస్థ ట్యూన్ చేసింది. సబ్‌వూఫర్ చుట్టూ RGB ఫ్లోటింగ్ లైట్ రింగ్ ఉండటం మరో ప్రత్యేకత. ఇది మ్యూజిక్ ప్లేబ్యాక్, నోటిఫికేషన్ల సమయంలో విజువల్ ఎఫెక్ట్స్‌ను అందిస్తుంది.
IP69 రేటింగ్, ఇతర ఫీచర్లు:
స్మార్ట్‌ఫోన్‌కు IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ అందించారు. 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IR సెన్సార్, Wi-Fi 7, బ్లూటూత్ 6.0, NFC వంటి ఫీచర్లు ఉన్నాయి. 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTEతో పాటు GPS, Galileo, GLONASS, QZSS, NavIC వంటి నావిగేషన్ సిస్టమ్‌లకు కూడా సపోర్ట్ ఉంది.
ధరలు:
చైనాలో REDMI K100 Pro Max 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 4,499 యువాన్లు (రూ.63,635)గా ఉంది. అదే 16GB + 256GB మోడల్ ధర 4,899 యువాన్లు (రూ.69,295)గా నిర్ణయించారు. 12GB + 512GB వేరియంట్ 5,099 యువాన్లు (రూ.72,120), 16GB + 512GB మోడల్ 5,499 యువాన్లు (రూ.77,780)గా ఉంది. టాప్-ఎండ్ 16GB + 1TB వేరియంట్ ధర 5,999 యువాన్లు (రూ.84,855)గా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ మొబైల్ చైనా మార్కెట్లో అమ్మకాలకు అందుబాటులో ఉంది. భారత్‌లో ఈ ఫోన్ లాంచ్‌పై ప్రస్తుతానికి అధికారిక సమాచారం లేదు.
తాజావార్తలు
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్‌కి కూడా సాధ్యం కాలేదు..
-
Rocky Flintoff: తండ్రిని మించిన కొడుకు.. 18 ఏళ్ల రాకీ ఫ్లింటాఫ్ విధ్వంసం.. తండ్రి రికార్డులే టార్గెట్!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
ట్రెండింగ్
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!