NTV Telugu Site icon

Redmi A4 5G Price: 50 ఎంపీ కెమెరా, 5160 ఎంఏహెచ్‌ బ్యాటరీ.. 8 వేలకే రెడ్‌మీ 5జీ స్మార్ట్‌ఫోన్‌!

Redmi A4 5g Price

Redmi A4 5g Price

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ ‘షావోమీ’కి చెందిన సబ్‌బ్రాండ్‌ రెడ్‌మీ.. బడ్జెట్ ధరలో సూపర్ 5జీ మొబైల్‌ను లాంచ్‌ చేసింది. ఏ సిరీస్‌లో ‘రెడ్‌మీ ఏ4’ 5జీని ఈరోజు భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. ఏ సిరీస్‌లో లాంచ్ అయిన మొదటి 5జీ స్మార్ట్‌ఫోన్‌ ఇదే కావడం విశేషం. స్నాప్‌డ్రాగన్‌ 4ఎస్‌ జన్‌2 ప్రాసెసర్‌తో వచ్చిన మొట్టమొదటి ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ ఇదే. రెడ్‌మీ ఏ4 ధర రూ.8,499లే అయినా.. 50 ఎంపీ కెమెరా, 5160 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండడం విశేషం.

రెడ్‌మీ ఏ4 5జీ స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4జీబీ+64జీబీ వేరియంట్‌ ధర రూ.8,499గా ఉండగా.. 4జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.9,499గా ఉంది. పర్పుల్‌, బ్లాక్‌ కలర్స్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. నవంబర్‌ 27 నుంచి రెడ్‌మీ ఏ4 5జీ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఎంఐ వెబ్‌సైట్, అమెజాన్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు. తక్కువ ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ చూసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి.

Also Read: Virat Kohli: ఈ పదేళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశా.. కోహ్లీ పోస్ట్‌ వైరల్! గందరగోళంలో ఫాన్స్

రెడ్‌మీ ఏ4 5జీలో 6.88 ఇంచెస్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉండగా.. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేటుతో వస్తోంది. ఆండ్రాయిడ్‌ 14 హైపర్‌ ఓస్‌తో వస్తోంది. రెండేళ్ల పాటు ఓఎస్‌ అప్‌డేట్స్‌, 4 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరాను ఇచ్చారు. సెల్ఫీల కోసం 5 ఎంపీ కెమెరా ఉంటుంది. 5,160 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండగా.. 18 వాట్స్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తోంది. 33 వాట్స్ అడాప్టర్‌ను ఉచితంగా ఇస్తున్నారు. ఈ ఫోన్ ఐపీ52 రేటింగ్‌తో వస్తోంది.

Show comments