Redmi A4 5G Price: క్రేజీ ఫీచర్స్, బిగ్ బ్యాటరీ.. 10 వేలకే రెడ్మీ 5జీ ఫోన్! ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ ఇదే
- రెడ్మీ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్
- 10 వేలకే రెడ్మీ ఏ4 5జీ
- ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Redmi A4 5G Launch and Price in India: చైనీస్ మొబైల్ కంపెనీ షావోమీ సబ్ బ్రాండ్ ‘రెడ్మీ’.. సామాన్యులకు అందుబాటు ధరలో స్మార్ట్ఫోన్లను లాంచ్ చేస్తుంటుంది. మధ్య తరగతి ప్రజలకు హాట్ ఫేవరెట్ రెడ్మీ ఫోన్లే. అందుకే రెడ్మీ నుంచి ఏ ఫోన్ రిలీజ్ అయినా హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. అతి తక్కువ ధరలో ఇప్పటికే ఎన్నో ఫోన్లను తీసుకొచ్చిన రెడ్మీ.. తాజాగా తక్కువ బడ్జెట్లో 5జీ ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. ‘రెడ్మీ ఏ4’ 5జీ పేరుతో ఫోన్‌ను వదిలింది.
రెడ్మీ ఏ4 5జీని ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2024లో రెడ్మీ ప్రదర్శించింది. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్. 4 జీబీ+64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో రానుంది. ఈ మొబైల్ ధరను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే రూ.10 వేల లోపు ఉండొచ్చని తెలుస్తోంది. స్నాప్‌డ్రాన్ 4ఎస్ జెన్2 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ రానుంది. ఈ ప్రాసెసర్‌తో ఇండియన్ మార్కెట్లో వస్తున్న ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ ఇదే అని కంపెనీ చెబుతోంది. 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉంటుంది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
రెడ్మీ ఏ4 స్మార్ట్‌ఫోన్‌లో 6.25 ఇంచెస్‌తో కూడిన హెచ్డీ ప్లస్ డిస్ప్లేను ఇస్తున్నారు. 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. ఈ ఫోన్లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరా ఉండనుంది. సెకండరీ కెమెరా కూడా ఉంది. 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఇందులో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉండగా.. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ఎప్పటి నుంచి ఉంటుందో కంపెనీ ఇంకా అనౌన్స్ చేయలేదు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..