Infinix Zero Flip Launche in India: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం మొబైల్ మార్కెట్‌లో ‘ఫోల్డబుల్’ ఫోన్‌లకు ఆదరణ పెరుగుతోంది. దాంతో చాలా మైబైల్ తయారీ సంస్థలు ఈతరహా ఫోన్‌లను లాంచ్ చేస్తున్నాయి. హువావే, గూగుల్ పిక్సెల్, వన్‌ప్లస్, శాంసంగ్.. కంపెనీలు ఇప్పటికే ఫోల్డబుల్ ఫోన్‌లను లాంచ్ చేశాయి. తాజాగా చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ ‘ఇన్‌ఫినిక్స్’ తొలి ఫోల్డబుల్ ఫోన్‌ను భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ‘ఇన్‌ఫినిక్స్ జీరో ఫ్లిప్’ పేరిట లాంచ్ చేసింది.
Infinix Zero Flip Price in India:
ఆకర్షణీయమైన డిజైన్‌లో వచ్చిన ఇన్‌ఫినిక్స్ జీరో ఫ్లిప్ ధర రూ.49,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+512జీబీ వేరియంట్ అందుబాటులో ఉంది. బ్లోసమ్ గ్లో, రాక్ బ్యాక్ రంగుల్లో ఈ ఫోల్డబుల్ ఫోన్ లభిస్తుంది. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అక్టోబర్ 24 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే.. రూ.5వేలు తగ్గింపు పొందొచ్చు.
Infinix Zero Flip Specs:
ఇన్‌ఫినిక్స్ జీరో ఫ్లిప్ 6.9 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌టీపీఓ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తోంది. 120Hz రిఫ్రెష్ రేటు, 360Hz టచ్ సాంప్లింగ్ రేటును ఇది కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14తో వస్తోన్న ఈ ఫోన్‌లో మీడియా టెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్‌ను ఇచ్చారు. బయటవైపు 3.64 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉండగా.. 120Hz రిఫ్రెష్ రేటు, 240Hz టచ్ సాంప్లింగ్ రేటుతో వస్తోంది. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది.
Also Read: IND vs NZ: న్యూజిలాండ్‌తో సిరీస్.. హర్మన్‌ప్రీత్‌కే కెప్టెన్సీ! నలుగురు కొత్త ప్లేయర్లకు చోటు
Infinix Zero Flip Camera and Battey:
ఇన్‌ఫినిక్స్ జీరో ఫ్లిప్ ఔటర్ స్క్రీన్‌పై డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50 ఎంపీ కెమెరా, 114 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 50 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరాను ఇచ్చారు. ఎక్స్‌టర్నల్ స్క్రీన్‌లో సెల్ఫీ కోసం 50 ఎంపీ కెమెరా ఇచ్చారు. దాంతో 4కె వరకు వీడియోలు రికార్డ్ చేయొచ్చు. 4720 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ, 70 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఇన్‌ఫినిక్స్ జీరో ఫ్లిప్ వస్తోంది.