REDMAGIC 10S Pro: మైండ్ బ్లోయింగ్ ఫీచర్లతో గేమర్ల కోసం కొత్త స్మార్ట్‌ఫోన్ రెడ్ మేజిక్ 10S ప్రో లాంచ్..!
- గ్లోబల్ మార్కెట్లో గేమింగ్ ఫీచర్లతో రెడ్ మేజిక్ 10S ప్రో విడుదల.
- 7050mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు.
- 50MP ప్రధాన కెమెరా, 50MP అల్ట్రా వైడ్ లెన్స్, 2MP మాక్రో కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
REDMAGIC 10S Pro: REDMAGIC బ్రాండ్ నుండి కొత్త గేమింగ్ ఫీచర్ల సపోర్ట్ తో స్మార్ట్‌ఫోన్ రెడ్ మేజిక్ 10S ప్రో ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. మరి ఈ ప్రీమియం ఫీచర్ల ఫోన్ గురించి పూర్తిగా తెలుసుకుందామా..
Read Also: Kannappa : కన్నప్పలో రజినీకాంత్ ను తీసుకుందామనుకున్నా.. విష్ణు కామెంట్స్ వైరల్
Also Read
- Sanjay Raut: కాంగ్రెస్‌లో విలీనం కావాలి.. టీఎంసీ, ఎన్సీపీలకు సంజయ్ రౌత్ పిలుపు..
- Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్‌కు కీలక సమాచారం!
- Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
- PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం

ఈ రెడ్ మేజిక్ 10S ప్రో లో 6.85 అంగుళాల భారీ 1.5K OLED BOE Q9+ డిస్ప్లేతో వస్తోంది. దీని రిఫ్రెష్ రేట్ 144Hz, పీక్ బ్రైట్నెస్ 2000 నిట్స్ వరకు ఉంటుంది. అత్యుత్తమ విజువల్ అనుభవాన్ని అందించేందుకు ఇది 2592Hz PWM డిమ్మింగ్, DC డిమ్మింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ మొబైల్ లో ప్రాసెసర్ గా అత్యాధునికమైన స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ లీడింగ్ వెర్షన్ ను ఉపయోగిస్తోంది. ఇది గరిష్ఠంగా 4.47GHz స్పీడ్ వరకు పని చేస్తుంది. ఈ ఫోన్ 12GB, 16GB, 24GB LPDDR5T RAM వేరియంట్లలో వస్తుంది. అలాగే, 256GB, 512GB, 1TB స్టోరేజ్ ఎంపికలలో వస్తున్నాయి.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత REDMAGIC OS 10.5 పై రన్ అవుతుంది. గేమింగ్ ప్రదర్శనను మెరుగుపరిచే విధంగా ఇందులో Red Core R3 Pro అనే ప్రత్యేకంగా రూపొందించిన గేమింగ్ చిప్, 10-లేయర్ ICE-X కూలింగ్ సిస్టమ్ ఉంది. ఇందులో లిక్విడ్ మెటల్ 2.0 ఉపయోగించబడింది. ఇది 23000 RPM సైలెంట్ RGB టర్బోఫ్యాన్ ద్వారా వేడి నియంత్రణను మెరుగుపరుస్తుంది.
Read Also: Sri Sri Sri Raja Vaaru Review: ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ రివ్యూ

ఇక మొబైల్ లో బ్యాటరీ పరంగా చూస్తే.. ఇందులో 7050mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనికి 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇక కెమెరా సెటప్ విషయానికి వస్తే.. 50MP ప్రధాన కెమెరా (OISతో), 50MP అల్ట్రా వైడ్ లెన్స్, 2MP మాక్రో కెమెరాలు ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం, 16MP అండర్-డిస్ప్లే కెమెరాను ఉపయోగించారు. ఇది కొత్త AI టెక్నాలజీతో ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
గేమింగ్ లక్ష్యంగా తయారు చేసిన ఈ ఫోన్లో 520Hz షోల్డర్ ట్రిగర్స్, DTS:X ULTRA స్టీరియో స్పీకర్లు, 3.5mm ఆడియో జాక్, RGB లైటింగ్ కలిగిన 23,000 RPM ఫ్యాన్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా ఇది 5G, Wi-Fi 7, Bluetooth 5.4, NFC, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్ వంటి ఆధునిక ఫీచర్లను కలిగి ఉంది.
ఇక ఈ మొబైల్ ధరల విషయానికి వస్తే.. మొదటి వేరియంట్ నైట్ ఫాల్ (12GB+256GB – Matte Black) ధర 699 డాలర్లు (దాదాపు రూ. 60,025) కాగా.. రెండవ వేరియంట్ మూన్ లైట్ (16GB+512GB – సిల్వర్ ట్రాన్స్పరెంట్) / డస్క్ (16GB+512GB – బ్లాక్ ట్రాన్స్పరెంట్) ధర 848 డాలర్లు (దాదాపు రూ.72,820), మూడవ వేరియంట్ మూన్ లైట్ (24GB+1TB – సిల్వర్ ట్రాన్స్పరెంట్) / డస్క్ (24GB+1TB – బ్లాక్ ట్రాన్స్పరెంట్) ధర 999 డాలర్లు (దాదాపు రూ. 85,790)గా నిర్ణయించారు.
తాజావార్తలు
-
Sanjay Raut: కాంగ్రెస్‌లో విలీనం కావాలి.. టీఎంసీ, ఎన్సీపీలకు సంజయ్ రౌత్ పిలుపు..
-
Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్‌కు కీలక సమాచారం!
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
-
PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!