Sri Sri Sri Raja Vaaru Review: ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: Narne Nithin, Sampada, Rao Ramesh, Naresh and others
- DIRECTOR: Satish Vegesna
- MUSIC:
- PRODUCER: Ch Rama Rao
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ హీరోగా ఇప్పటికే ఆయ్, మాడ్, మాడ్ స్క్వేర్ లాంటి సినిమాలు చేసి హిట్లు అందుకున్నాడు. అయితే నిజానికి ఆయన హీరోగా పరిచయం కావాల్సింది శ్రీశ్రీశ్రీ రాజావారు అనే సినిమాతో. నేషనల్ అవార్డు విన్నింగ్ శతమానంభవతి డైరెక్టర్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో చింతపల్లి రామారావు నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. ఎప్పుడో 2022లో మొదలైన ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ పలు కారణాలతో రిలీజ్ కాలేదు. నార్నె నితిన్ ఈ సినిమా ఆగిపోయిందని చెప్పుకున్నాడు కానీ నిర్మాత మాత్రం సినిమా ఆగిపోలేదని, త్వరలో రిలీజ్ అవుతుందని చెప్తూ వచ్చాడు. ఎట్టకేలకు ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు చూద్దాం.
శ్రీశ్రీశ్రీ రాజావారు కథ:
ఆత్రేయపురంలో ఇద్దరు స్నేహితులు (సీనియర్ నరేష్, రావు రమేష్) రాజకీయంగా ఎదగాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారిలో నరేష్‌కు పుట్టినప్పుడే కొడుకు చలనం లేకుండా పుడతాడు. అయితే నరేష్ తమ్ముడు తాగే సిగరెట్ పొగ కారణంగా ఆ బుడతడు (నార్నె నితిన్) ఊపిరిలందుకుంటాడు. అలా సిగరెట్ పొగతో ప్రాణం పోసుకున్న ఆ కుర్రాడు పెరిగి పెద్దయిన తర్వాత చైన్ స్మోకర్‌గా మారతాడు. ఈ క్రమంలో తన తండ్రి స్నేహితుడైన రావు రమేష్ కుమార్తె నిత్య (సంపద)తో ప్రేమలో పడతాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని పెద్దల దృష్టికి తీసుకెళ్తే, ముందు ఇష్టం లేకపోయినా రావు రమేష్ రాజకీయం కోసం పెళ్లికి సరేనంటాడు. అయితే, పెళ్లి పెళ్లే, రాజకీయం రాజకీయమే అని నరేష్ తేల్చి చెప్పడంతో సిగరెట్ కారణం చూపి ఆ పెళ్లి క్యాన్సిల్ చేస్తాడు. అయితే ప్రేమించుకున్న ఈ ఇద్దరు చివరికి ఒకటవుతారా? సిగరెట్ లేకుండా క్షణమైనా గడవని రాజా తన ప్రేమ కోసం సిగరెట్ వదిలేశాడా లేక ప్రేమనే వదిలేశాడా? చివరికి ఏమైంది అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
Also Read
విశ్లేషణ:
నిజానికి ఇది ఒక మలయాళ సినిమాకు అడాప్షన్. పేరుకు అడాప్షన్ అన్నారు కానీ, పేర్లతో సహా దాదాపుగా అదే కథను దింపేయడం మనకు రీమేక్ ఫీలింగ్ కలిగిస్తుంది. 2018లో రిలీజ్ అయిన తీవండి (మలయాళంలో చైన్ స్మోకర్) అనే సినిమాలో టోవినో లీడ్ రోల్‌లో నటించాడు. అదే సినిమాను తెలుగులో శ్రీశ్రీశ్రీ రాజావారు అనే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే సినిమా ప్రారంభమైనప్పటి నుంచి హీరో క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా టైం తీసుకున్నాడు దర్శకుడు. ఈ క్రమంలో రాసుకున్న కొన్ని సీన్స్ అనవసరమైనవిగా అనిపిస్తాయి. నిజానికి సినిమాలో కామెడీ పండించడం కోసం సుదర్శన్, రచ్చ రవి సహా కొంతమంది మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టులను పెట్టుకున్నారు కానీ, వారిచేత నవ్వించే ప్రయత్నం చేశారు కానీ ప్రేక్షకులకు మాత్రం ఆ నవ్వులు రావడం కష్టమే. అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో క్యారెక్టరైజేషన్, హీరో-హీరోయిన్ల ప్రేమ, ఆ తర్వాత దాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లడం అనే అంశాలతో ముడిపెడుతూ ఓ మాదిరిగా తీసుకెళ్లినా, సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత హీరో చేత సిగరెట్ మానిపించాలనే ఏకైక లక్ష్యంతో సెకండ్ హాఫ్ మొత్తం నడుస్తుంది. ఎలాగైనా మానేసి తాను ప్రేమించిన నిత్యను దక్కించుకోవాలని రాజా ప్రయత్నాలు చేస్తుంటే, ఎలాగైనా అతని చేత సిగరెట్ తాగించి పెళ్లి క్యాన్సిల్ చేయించాలని రావు రమేష్ అండ్ టీం కష్టపడుతూ ఉంటారు. ఇది వినడానికి లైన్ బాగానే ఉన్నా, దాన్ని ఎగ్జిక్యూషన్ విషయంలో ఈ టీం తడబడింది. ఆ విషయంలో కేర్ తీసుకుని ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేదేమో. అయినా 2020లో మొదలుపెట్టిన సినిమాను దాదాపు ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కూడా కాస్త ఇబ్బందికర అంశమే. ఎందుకంటే అప్పుడు రాసుకున్న రైటింగ్ ఇప్పటి ప్రేక్షకుల మనస్తత్వాలకు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. అప్పట్లో ఈ రైటింగ్ చూసి ప్రేక్షకులకు నవ్వు అలాగే ఎమోషన్స్ కలిగేవేమో, కానీ ఇప్పటి ప్రేక్షకులు ఆశించే కంటెంట్ అయితే ఈ సినిమా డెలివర్ చేయడంలో తడబడింది.
ఇక నటీనటుల విషయానికి వస్తే, ఇది ఎన్టీఆర్ బావమరిది నితిన్‌కు మొదటి సినిమా. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆయన ఇప్పటి సినిమాలతో పోలిస్తే ఈ మొదటి సినిమాలోనే డైలాగ్ డెలివరీ కానీ, ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ కానీ బాగా కుదిరాయి. ఒకపక్క ఫైట్స్, మరోపక్క డాన్స్‌తో కూడా మంచి మార్కులు వేయించుకునే ప్రయత్నం చేశాడు. అయితే షూటింగ్ గ్యాప్ వల్ల అతని లుక్‌లో వేరియేషన్స్ ఈజీగా కనిపిస్తున్నాయి. ఆ విషయంలో కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. సంపద ఉన్నంతలో బాగా చేసింది. తనదైన శైలిలో ఆమె ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక రావు రమేష్, నరేష్ నటన గురించి చెప్పేదేముంది, ఇద్దరూ పోటాపోటీగా నటించారు. సుదర్శన్, రచ్చ రవి వంటి వాళ్లు ఉన్నా సరే, కామెడీ విషయంలో పెద్దగా మార్కులు వేయించుకునే ప్రయత్నం చేయలేదు. ఉన్నంతలో పర్వాలేదనిపించారు. మిగతా పాత్రధారులు అందరూ తమ పరిధి మేరకు నటించారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే, కొన్ని పాటలు బాగున్నాయి. విజువల్స్ పరంగా కూడా చాలా న్యాచురల్ ఫీల్ తీసుకొచ్చే విషయంలో కెమెరామెన్ మంచి మార్కులు వేయించుకునే ప్రయత్నం చేశాడు. నిడివి విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. కొన్ని డైలాగ్స్ బాగున్నా, ఎప్పుడో రాసుకున్న డైలాగ్స్ కాబట్టి కాస్త అప్‌డేటెడ్ ఫీల్ కలిగిస్తున్నాయి. ఆ విషయంలో కూడా ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది.
ఫైనల్లీ, అంచనాలు లేకుండా వెళితే కొందరికి నచ్చే శ్రీశ్రీశ్రీ రాజావారు ..కానీ కండిషన్స్ అప్లై
నోట్: ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..
- Tags
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!