Breaking News : తెలంగాణ వాసులు జాగ్రత్త.. తెలంగాణకు రెడ్ అలర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత మూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ఇప్పటికే చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువుల కట్టలు తెగి గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయాలు సైతం నిండిపోతుండడంతో దిగువకు గేట్లను ఎత్తుతున్నారు. అయితే.. మరో రెండు రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరో 48 గంటల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురేసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో తెలంగాణకు రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. అయితే ఇప్పటికే సీఎం కేసీఆర్ భారీ వర్షాలపై ఆరా తీశారు. జిల్లాల వారీగా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. వరద నీటిలో చిక్కుకున్న గ్రామాలకు సహాయక చర్యలు అందించాలని.. జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు భారీ వర్షాలపై సమీక్షించాలన్నారు.
Gurukul Inter Results :ఎస్సీ గురుకుల ఇంటర్ ఫస్టియర్ ఎంట్రన్స్ ఫలితాలను విడుదల
Also Read
- Donald Trump: "ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు".. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
- IND vs IRE: పరువు నిలబెట్టుకునే పోరు.. సంజూకు రెస్ట్.. వైభవ్‌కు ఛాన్స్.. టీమిండియా ప్లేయింగ్-11 ఇదే!
- PM Modi: సీషెల్స్‌లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్‌లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
సీఎస్ సోమేశ్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమావేశం నిర్వహించి భారీ వర్షాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా.. ప్రజలు అవరమైతే తప్ప బయటకు రావద్దని సీఎం కేసీఆర్ సూచించారు. నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో గత రెండు రోజుల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటితో పాటు.. భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, కొత్తగూడెంలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది వాతావరణ శాఖ. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు జనజీవనం అస్తవ్యస్తమైంది.
తాజావార్తలు
-
Suzuki GSX250R: సుజుకీ GSX250R ఆవిష్కరణ.. భారత్‌లో కూడా విడుదలవుతుందా?
-
Imad Wasim: మాజీ భార్య సంచలన ఆరోపణలు.. మౌనం వీడిన పాక్ క్రికెటర్ ఇమాద్ వసీం
-
Phone, Laptop: వాడిన ఫోన్ లేదా ల్యాప్‌టాప్ కొనాలని ఆలోచిస్తున్నారా? ఈ విషయాలు మర్చిపోకండి..!
-
Anushka Shetty : అనుష్క ఇక సినిమాలు చేయడం.. బయట కనిపించడం కష్టమే..
-
Donald Trump: “ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు”.. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!