రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని, ఈ మేరకు ప్రజలే బీజేపీ నాయకులకు భరోసా ఇస్తున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. 18 రోజుల వ్యవధిలో 11 వేల 123 స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లను నిర్వహించి దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించామన్నారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్ సక్సెస్ చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సహా అగ్ర నేతలు అభినందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ బాధ్యులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లుసహా కమిటీ సభ్యులందరినీ బండి సంజయ్ తోపాటు మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ ఘనంగా సన్మానించారు.
Also Read : Sathvik Suicide: సాత్విక్ సూసైడ్.. వైరల్ అవుతున్న నాగచైతన్య స్పీచ్
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ బూత్ స్థాయి కార్యకర్త మొదలు జాతీయ కార్యవర్గ సభ్యుల వరకు ప్రతి ఒక్కరూ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ లో భాగస్వాములయ్యారన్నారు. ఈ మీటింగ్స్ ద్వారా క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలపై చర్చించడంతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగామన్నారు. ఈ మీటింగ్ లకు హాజరైన ప్రజలు బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని పార్టీ నాయకులకే భరోసా ఇచ్చారని పేర్కొన్నారు.
Also Read : Sathvik Suicide: సాత్విక్ సూసైడ్.. వైరల్ అవుతున్న నాగచైతన్య స్పీచ్
రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ …9,224 శక్తి కేంద్రాలకుగాను 11 వేల 123 స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ నిర్వహించడం గొప్ప విషయమన్నారు. స్థానిక నేతల్లో సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఈ మీటింగ్స్ ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. ప్రతి గ్రామంలోనూ కాషాయ జెండాలు రెపరెపలాడాయన్నారు. ప్రారంభ, ముగింపు సభలను ఘనంగా నిర్వహించడంతోపాటు ఈ మీటింగ్స్ భవిష్యత్ కార్యక్రమాలకు మోడల్ గా నిలిచేలా చేయడం ఆనందంగా ఉందన్న్నారు.