Reasons Behind Luna-25 Crash: చంద్రుని దక్షిణ ధ్రువంపైకి చేరుకొని ఆ ఘనత సాధించిన తొలి దేశంగా రికార్డు క్రియేట్ చేయాలని భారత్ భావిస్తున్న తరుణంలో రష్యా దానికి బ్రేక్ వేయాలని చూసింది. హడావుడిగా లూనా-25ను చంద్రుని దక్షిణ ధ్రువంపై దింపాలని చూసింది. అయితే ఆ ప్రయత్నం కాస్తా బెడిసి కొట్టింది. 47 సంవత్సరాల తరువాత జాబిల్లిపై ప్రయోగం చేయడానికి రష్యా పూనుకుంది. ఇండియా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగాని కంటే ముందు తమ లూనా 25 చంద్రునిపై దిగాలని తాపత్రయ పడింది. అయితే చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ కాలేక చివరి నిమిషయంలో క్రాష్ అయిపోయింది. చిట్టచివరి నిమిషయంలో ల్యాండ్ కావడంలో మిషన్ ఘోరంగా విఫలమయ్యింది. దీంతో భారత్ కన్నా ముందు నిలవాలన్న రష్యా కల కలగానే మిగిలిపోయింది.
లూనా 25 పేరుతో ఆగస్టు 10న ఈ అంతరిక్ష నౌకను చాలా తక్కవ వ్యవధిలోనే రష్యా చంద్రునిపైకి ప్రయోగించింది. రష్యా ఫార్ ఈస్ట్ రీజియన్ లో ది వోస్టోఖ్ని కస్మో డ్రోమ్ నుంచి ఈ రాకెట్ ను అంతరిక్షంలోకి పంపించింది.
Also Read: చంద్రయాన్3 ల్యాండింగ్ ఆలస్యం కానుందా? మరో తేదీకి పోస్ట్ పోన్ అవుతుందా?
ఇది శనివారం మధ్యాహ్నం 2:57 నిమిషాలకు చంద్రుని దక్షిణ ధ్రువం పై ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే ల్యాండ్ అయ్యే సమయంలో ల్యాండ్ వేగాన్ని శాస్త్రవేత్తలు తమ అదుపులోకి తెచ్చుకోలేకపోయారు. దీంతో ల్యాండర్ వేగంగా వెళ్లి చంద్రుని ఉపరితలాన్ని తాకి క్రాష్ అయిపోయింది. అయితే ల్యాండింగ్ అవ్వడానికి కేవలం కొద్ది నిమిషాల ముందు ఈ రాకెట్ తోఉన్న సంబంధాలు తెగిపోయాయి.రష్యా శాస్త్రవేత్తలు సంబంధాలను పునరుద్దరించుకోవడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. అనంతరం అన్నీ పరిశీలన చేసుకున్న తరువాత లూనా 25 క్రాష్ అయినట్లు రష్యా అంతరిక్ష సంస్థ ప్రకటన చేసింది. భారత్ కన్నా ముందే దక్షిణ ధ్రువాన్ని చేరిన దేశంగా మారాలన్న కోరికతో తక్కువ సమయంలో ప్రయోగం, వేగవంతమైన నిర్ణయాలే ప్రయోగాన్ని విఫలం చేశాయా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే అందరూ అనుకున్నట్లు లూనా 25 ప్రయోగాన్ని ఉన్న పళంగా రష్యా చేపట్టలేదు. 2021లోనే లూనా 25ను ప్రయోగించాలని రష్యా అనుకుంది. అయితే రష్యా ఉక్రెయిన్ యుద్దం కారణంగా ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. అయితే భారత్ చంద్రయాన్ 3ని ప్రయోగించడంతో ఇక ఆలస్యం చేయకూడదని రష్యా లూనా 25 ప్రయోగాన్ని చేపట్టింది. స్లింగ్ షాట్ పద్ధతిలో టైమ్ వేస్ట్ చేసుకోవాలనుకోలేదు రష్యా. ఖర్చు ఎక్కువైనా సరే భారత్ కంటే ముందే లూనా 25 ను చంద్రుని దక్షిణ ధ్రువంపైకి దింపాలనుకుంది. ఇండియా, నాసా తో కలిసి ఆర్టెమిస్ ప్రయోగాలకు దిగటం దీనికి ఓ కారణంగా అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా వుండగా ప్రీ ల్యాండింగ్ ఆర్బిట్ లోకి వెళ్లటమే లూనాకు సమస్యలు తెచ్చిపెట్టింది. అంతేకాకుండా చివరి నిమిషంలో ల్యాండర్ వేగాన్ని శాస్త్రవేత్తలు నియంత్రించలేకపోవడమే లూనా 25 కూలిపోవడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మొత్తానికైతే భారత్ ప్రయోగం కంటే ముందు తాము సక్సెస్ కావాలని, తద్వారా ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి దేశంగా నిలవాలని ఆశించి రష్యా భంగపాటుకు గురైంది.