Huge Discounts on Smartphones at Realme Festive Days Sale 2023: ‘రియల్‌మీ’ మొబైల్ కంపెనీ ‘ఫెస్టివ్ డేస్ సేల్’ను ప్రకటించింది. ఈ సేల్ అక్టోబర్ 8న ప్రారంభం అయి అక్టోబర్ 15 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో కస్టమర్‌లకు అద్భుతమైన డీల్స్, డిస్కౌంట్‌లను రియల్‌మీ అందిస్తోంది. సేల్ సందర్భంగా స్మార్ట్‌ఫోన్‌లు మరియు ఏఐఓటీ ఉత్పత్తుల శ్రేణిపై భారీ తగ్గింపులు ఉన్నాయి. ఈ డీల్స్ అధికారిక రియల్‌మీ వెబ్‌సైట్‌లో సహా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ కామర్స్ దిగ్గజాలు కొన్ని రియల్‌మీ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ ఆఫర్‌లను ఇవ్వబోతున్నాయి.
Realme 11 Pro+ 5G Amazon Discounts:
ఫెస్టివ్ డేస్ సేల్‌లో రియల్‌మీ నార్జో 60 సిరీస్ 5G, రియల్‌మీ నార్జో ఎన్53 మరియు రియల్‌మీ నార్జో ఎన్55పై ప్రత్యేకమైన తగ్గింపులు ఉన్నాయి. ఇవి ప్రత్యేకంగా అమెజాన్ మరియు రియల్‌మీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఎర్లీ యాక్సెస్ ఆఫర్ అక్టోబర్ 7వ తేదీ అర్ధరాత్రి నుండి ప్రత్యేకంగా అందుబాటులో (Amazon.in, realme.com) ఉంటుంది. రియల్‌మీ 11 ప్రో ప్లస్ (Realme 11 Pro+ 5G ) అసలు ధర రూ. 27,999 (8GB RAM) కాగా.. రూ. 24,999గా ఉంటుంది. 12GB RAM వేరియెంట్ రూ. 29,999 కాగా.. రూ. 28,999 ధరలకు అందుబాటులో ఉంటాయి.
Realme 11 Pro 5G Flipkart Offers;
రియల్‌మీ 11 ప్రో (Realme 11 Pro 5G) ఫోన్ ఫెస్టివ్ డేస్ సేల్‌లో రూ. 19,999కి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ 8 GB RAM + 128 GB స్టోరేజ్ మోడల్ అసలు ధర రూ. 23,999గా ఉంటే.. 8 GB RAM + 256 GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 24,999గా ఉంది. ఇక రియల్‌మీ 11 ఎక్స్ (Realme 11x 5G) ఫోన్ అసలు ధర రూ. 14,999 (6 GB RAM)గా ఉండగా ఆఫర్‌లో రూ.11,999కి అందుబాటులో ఉంటుంది. రూ. 15,999 (8 GB RAM) వేరియెంట్.. రూ. 14,999కి అందుబాటులో ఉంటుంది.
Also Read: iPhone 14 Price Drop: అతి తక్కువ ధరకే ఐఫోన్ 14.. ఈ అవకాశం మళ్లీ మళ్లీ రాదు!
Realme 11 5G Discounts:
రియల్‌మీ 11 (Realme 11 5G) ఫోన్ 8 GB RAM + 128 GB వేరియంట్ మోడల్ అసలు ధర రూ. 18,999గా ఉంటే.. ఫెస్టివ్ డేస్ సేల్ ఆఫర్‌లో రూ. 15,999కి అందుబాటులో ఉంటుంది. రియల్‌మీ సీ53 (Realme C53) ఫోన్ ఆఫర్‌లో రూ. 9,499కి అందుబాటులో ఉంటుంది. 4 GB + 128 GB రూ. 9,999కి, 6GB + 64GB ధర రూ. 10,999కి.. 16 GB + 128 GB రూ. 11,999కి అందుబాటులో ఉంది.
Realme Narzo 60x 5G Offers:
రియల్‌మీ నార్జ్ 60 ఎక్స్ (Realme Narzo 60x 5G) ఫోన్ ఆఫర్‌లో రూ. 11,499కి అందుబాటులో ఉంది. నిజానికి ఈ ఫోన్ ధర 6GB RAM ధర రూ. 14,499గా ఉంది. 4GB RAM వేరియంట్ రూ. 10,999కి ఆఫర్‌లో అందుబాటులో ఉండగా.. దీని అసలు ధర రూ. 12,999గా ఉంది. ఇక రియల్‌మీ నార్జ్ ఎన్53 (Realme Narzo N53) ఫోన్ రూ. 7,999కి ఆఫర్‌లో అందుబాటులో ఉంది.