Realme 14x 5G: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్‌మీ త్వరలో మార్కెట్లోకి తమ కొత్త 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనుంది. ఇందులో ముఖ్యమైనది రియల్‌మీ 14x 5G. ఈ డివైస్ 2024 డిసెంబర్ 18న భారత మార్కెట్లో విడుదల కానుందని సమాచారం. ముందస్తు వివరాలు ప్రకారం ఈ మొబైల్ హై-క్లాస్ స్పెసిఫికేషన్లతో వస్తోంది. ఇక ఈ ఫోన్ సంబంధించి స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే..
Also Read: Puspa 2 Collections: తగ్గేదేలే.. 10 రోజుల్లో పుష్పరాజ్ ఎంత కొల్లగొట్టాడంటే
ఈ మొబైల్ లో మీడియాటెక్ Dimensity 6300 5G చిప్ ప్రాసెసర్ వినియోగిస్తుండగా.. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ గా ఉండనుంది. ఇక ఈ ఫోన్ డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఇందులో 6.67 ఇంచ్ HD+ LCD స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇక మొబైల్ లో కెమెరా వివరాలు చూస్తే.. బ్యాక్ కెమెరాగా 50MP (OV50D) + 2MP డ్యూయల్ సెటప్ ఉండగా, ఫ్రంట్ కెమెరాగా 8MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇక అన్నికంటే ఈ మొబైల్ లో మాట్లాడుకోవలిసింది బ్యాటరీ గురించి. ఇందులో ఏకంగా 6000mAh కెపాసిటీ బ్యాటరీ అందిస్తూ, ఇందుకు 45W ఫాస్ట్ ఛార్జింగ్ అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్ లో 6GB/128GB, 8GB/128GB, 8GB/256GB వేరియంట్లు మెమరీ ఆప్షన్లుగా ఉన్నాయి. అలాగే ఈ మొబైల్ కు IP69 రేటింగ్ (డస్ట్, వాటర్ రెసిస్టెంట్) ప్రొటెక్షన్ అందించబడుతుంది.
Also Read: Manchu Vishnu: మంచువారి ఇంట్లో మళ్లీ గొడవ..
ఈ ఫోన్ 197 గ్రాముల బరువు, 7.9mm మందంతో వస్తుంది. క్రిస్టల్ బ్లాక్, గోల్డెన్ గ్లో, జువెల్ రెడ్ రంగులు అందుబాటులో మొబైల్ వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్టైలిష్ డిజైన్‌తో పాటు శక్తివంతమైన పనితీరును అందించనుంది. కేవలం బ్యాటరీ లైఫ్, కెమెరా, 5G సపోర్ట్ కాకుండా, పటిష్టమైన బిల్డ్ క్వాలిటీ కూడా ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇక వీటి ధరల విషయానికి వస్తే.. భారత మార్కెట్లో 4జీబీ+ 128జీబీ మోడల్ ధర రూ. 11,999, 6జీబీ+ 128జీబీ రూ. 13,499, , 8జీబీ+ 128జీబీ రూ. 14,999కు పొందవచ్చు.