Ind vs SA: టీమిండియాకు బిగ్ షాక్.. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కు ఆ స్టార్ బౌలర్ దూరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammed Shami: భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పాడు. టెస్ట్ సిరీస్ కోసం తాను దక్షిణాఫ్రికా వెళ్లేందుకు రెడీగా లేనట్లు వెల్లడించాడు. తన మోకాలి నొప్పి కోసం చికిత్స తీసుకుంటున్నాను.. కాస్త ఊరట లభించినా కచ్చితంగా టీమ్ తో కలుస్తానని వెల్లడించాడు. లేకపోతే తాను సఫారీలతో జరిగే మ్యాచ్ లకు దూరం కావొచ్చు అని పరోక్షంగా తెలిపాడు. కాగా వన్డే ప్రపంచకప్-2023లోకి లేట్‌గా ఎంట్రీ ఇచ్చిన షమీ అద్భుతమైన బౌలింగ్ తో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ ఐసీసీ మెగాటోర్నీలో ఏకంగా మూడు సార్లు ఐదు వికెట్ల హాల్ నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. అంతేకాదు.. ఈ టోర్నీ మొత్తంగా 24 వికెట్లు తీసుకుని ప్రపంచకప్-2023లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షమీ నిలిచాడు.
Read Also: Vivek Ramaswamy: అమెరికాకి “హిందూ” ప్రెసిడెంట్ ఎలా ఉండగలరు.? వివేక్ రామస్వామి ఏం చెప్పారంటే..?
Also Read
- Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ఈ క్రమంలో ప్రపంచకప్ తర్వాత మోకాలి నొప్పితో రెస్ట్ తీసుకున్న ఈ ఉత్తర ప్రదేశ్ బౌలర్.. ఆస్ట్రేలియాతో స్వదేశంలో టీ20, సౌతాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్‌లకు దూరం కాబోతున్నాడు. అయితే, ప్రొటిస్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో బీసీసీఐ మహ్మద్ షమీ పేరును చేర్చింది. అతడు గాయం నుంచి కోలుకుంటే దక్షిణాఫ్రికాకు వెళ్తాడనే సంకేతాలు ఇచ్చింది. అయితే, డిసెంబరు 26 నుంచి సౌతాఫ్రికా- టీమిండియా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో షమీ తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ కీలక విషయాన్ని వెల్లడించాడు. మోకాలి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తే దక్షిణాఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను.. చాలా కాలంగా ఈ నొప్పి వేధిస్తోంది.. ఇప్పటికే ఎన్నోసార్లు చికిత్స చేయించుకున్నాను.. కానీ, పూర్తిగా కోలుకోలేకపోతున్నాను అంటూ షమీ పేర్కొన్నారు. ఒకవేళ ఈ మోకాలి నొప్పి గనుక తగ్గితే నేను టెస్టు సిరీస్ ఆడటానికి కచ్చితంగా వెళ్తా.. లేదంటే అంతే ఇక అని షమీ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!