Kubera : శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన కుబేర మంచి సక్సెస్ కొట్టేసింది. ఇప్పటికే వంద కోట్ల మార్క్ దాటేసిన ఈ మూవీ.. 200 కోట్ల వైపు పరుగులు పెడుతోంది. ఈ క్రమంలోనే మూవీ సక్సెస్ పై శేఖర్ కమ్ముల షాకింగ్ కామెంట్స్ చేశారు. నేను ఈ కథను చాలా వరకు తగ్గించాను. వాస్తవానికి కథ ఇంకా చాలా ఉంది. కథ రాసుకున్నప్పుడే నాకు చాలా సవాళ్లు ఎదురయ్యాయి.
read also : Nothing Phone 3 Launch: ‘నథింగ్ ఫోన్ 3’ వచ్చేస్తోంది.. ఫీచర్స్, ప్రైస్ డీటెయిల్స్ ఇవే!
ఎందుకంటే ఇప్పుడున్న ప్రేక్షకులకు తగ్గట్టు కథలు రాసుకోవాలి. వారికి నచ్చేవిధంగా కథలు రాసుకుంటే అప్పుడే సక్సెస్ అవుతాం. ఇందులో హీరోయిన్లు లేరు. హీరోల పాత్రలు లేవు. ఒక బిచ్చగాడు, ఒక స్టార్ మాత్రమే ఉంటారు. కేవలం కథ మాత్రమే ఇందులో కనిపిస్తుంది. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులకు నచ్చేవిధంగా తీయడంలోనే దర్శకుడి ప్రతిభ ఉంటుంది.
ఒకప్పుడు 20 ఏళ్లకు తెలిసే విషయాలు అన్ని ఇప్పుడు సోషల్ మీడియా కారణంగా పదేళ్లకే తెలిసిపోతున్నాయి. కాబట్టి వారి మైండ్ సెట్ ను మెప్పించేలా మూవీని తీయాలని అనుకున్నాను. చాలా మంది నిడివి ఎక్కువ అయిందని అనుకుంటున్నారు. కానీ మేం చాలా ట్రిమ్ చేశాం అని శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు.
read also : Venky Atluri : ‘తొలిప్రేమ’ నా ఫస్ట్ సినిమా కాదు