Bandi Sanjay: తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన కామెంట్లు చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కొత్త సచివాలయం సచివాలయంలో మార్పులు చేస్తామన్నారు. డోమ్ లను కూల్చేస్తామన్నారు. . తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా మార్పులు చేస్తామని బండి వ్యాఖ్యానించారు. అసదుద్దీన్ తాజ్ మహల్ లెక్క కనిపిస్తుంది అన్నారు. ఒవైసీ కోసం డూమ్ లు కడితే ఊరుకోమని హెచ్చరించారు. అసదుద్దీన్ కళ్లల్లో ఆనందం కోసమే కొత్త సచివాలయాన్ని తాజ్ మహల్ లాగా కడుతున్నారన్నారు. ఇక ప్రగతిభవన్ ను ప్రజా దర్భార్ గా మారుస్తామని బండి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
Read Also: Buddha Venkanna: మంత్రి అమర్నాథ్ ఆస్తులపై విచారణ జరగాలి
అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించకుండా మోడీ, బీజేపీ ని తిడుతున్నారు. మేము ఇచ్చిన నిధుల పై ఢిల్లీ లో లేదా గోల్కొండ లో చర్చించడానికి సిద్ధమన్నారు. మోడీ అసెంబ్లీలో లేనప్పుడు ఆయన పేరు ఎలా ప్రస్తావిస్తారని ప్రశ్నించారు. తమ పార్టీకి ఓట్లు వేస్తే పేదలకు ఇళ్లు కట్టించే బాధ్యత మాదన్నారు. ఉచిత విద్య అందిస్తాం. ఫసల్ భీమా యోజన తెలంగాణలో అమలు చేసి రైతులను ఆదుకుంటామన్నారు.
Read Also: Banda Prakash : శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ఎన్నిక