Mayank Yadav Says My Goal is to play for the Country: ఎప్పటికైనా భారత జట్టుకు ఆడడమే తమ అంతిమ లక్ష్యం అని యువ ఆటగాడు మయాంక్ యాదవ్ తెలిపాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నాడు. ఐపీఎల్ 17వ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న మయాంక్.. అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే సంచలన బౌలింగ్‌తో ఆకట్టుకున్న అతడు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై చెలరేగాడు. 4 ఓవర్లు వేసిన మయాంక్ కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు.
మయాంక్ యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు. అవార్డు తీసుకున్న అనంతరం మయాంక్ మాట్లాడుతూ… ‘వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికవ్వడం చాలా సంతోషంగా ఉంది. రెండు మ్యాచుల్లోనూ మా జట్టు గెలిచింది. ఎప్పటికైనా భారత జట్టుకు ఆడడమే నా అంతిమ లక్ష్యం. నా ప్రయాణాన్ని ఇప్పుడే ప్రారంభించాననుకుంటున్నా. కామెరూన్ గ్రీన్ వికెట్‌ను పడగొట్టినందుకు సంతోషించాను. వేగంగా బౌలింగ్ చేయడానికి డైట్, మంచి నిద్ర, శిక్షణ చాలా అవసరం. అలానే చన్నీటి స్నానం, డైట్‌పై నిరంతరం శ్రద్ధ పెడుతున్నాను’ అని చెప్పాడు.
Also Read: Priyanka Jain : ప్రియాంక జైన్, శివకుమార్ ల పెళ్లి అక్కడ ఎందుకు జరిగిందో తెలుసా?
మయాంక్ యాదవ్ తన సంచలన బౌలింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. గంటకు 150 కి.మీ వేగంతో బంతులు సందిస్తునాడు. బెంగళూరుపై కూడా గంటకు 150 కి.మీ వేగంతో బంతులేశాడు. ఒక బంతిని ఏకంగా 156.7 కి.మీ వేగంతో వేసి రికార్డు సృష్టించాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా వేసిన బౌలర్ల జాబితాలో మయాంక్ టాప్ 4కి చేరుకున్నాడు. మయాంక్ బౌలింగ్ చూస్తే త్వరలోనే అతడి కల నెరవేరేలా ఉంది.