క్రికెట్ లవర్స్ ఐపీఎల్ 2024 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అన్న నిరీక్షణకు కేవలం కొద్ది గంటల్లో తెరపడనుంది. ఇక మొదటి మ్యాచ్ లోనే చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడుతుండడంతో హై- ఓల్టేజ్ యాక్షన్ తప్పదని ఐపీఎల్ అభిమానులు భావిస్తున్నారు. ఇక ఇప్పటివరకు ఐపీఎల్ మొత్తంలో 31 సార్లు సీఎస్కే – ఆర్సీబీలు తలపడగా అందులో.. సీఎస్కే 20సార్లు గెలవగా.. ఆర్సీబీ 10 సార్లు విజయం సాధించింది. ఒకసారి ఫలితం రాలేదు.
ఇక 2023 ఐపీఎల్ సీజన్ లో చిన్నస్వామి స్టేడియం లో జరిగిన సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో సీఎస్కే 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక.. ఆర్సీబీకి ‘చెపాక్ స్టేడియం’ కలిసి రాలేదని చూపొచ్చు. దీనికి కారణం స్టాట్స్ చూస్తే.. 2008లో జరిగిన తొలి మ్యాచ్ లో సీఎస్కే పై ఆర్సీబీ గెలిచింది. అయితే ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు 7-1 తేడాతో ఆర్సీబీ ఓటమిపాలైంది. 2008లో సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో లో- స్కోరింగ్ మ్యాచ్‌లో సీఎస్కే పై ఆర్సీబీ14 పరుగుల తేడాతో గెలిచింది. ఆ మ్యాచ్ లో ఆర్సీబీ 126 పరుగులు చేయగా.. సీఎస్కే కేవలం 112 పరుగులకే పరిమతి కావడంతో ఓడిపోయింది.
Also read: Operation Valentaine OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన వరుణ్ మూవీ .. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?
ఇక ఐపీఎల్ 2019 మొదటి మ్యాచ్ లోనే సీఎస్కే- ఆర్సీబీలు తలపడ్డాయి. కాకపోతే ఆనాటి మ్యాచ్ ని ఆర్సీబీ గుర్తుతెచ్చుకోకూడదని అనుకుంటుంది. ఎందుకంటే 17.4 ఓవర్లు మాత్రమే ఆడి ఆర్సీబీ.. కేవలం 70 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ మ్యాచ్ ను సీఎస్కే.. 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఆ తర్వాత 2012 సీజన్ లో ‘చెపాక్ జింక్స్’ పేరుకి ఆర్సీబీ దాదాపు ముగింపు పలికింది అనుకున్నారు. ఆ మ్యాచ్ లో క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్‌తో 20 ఓవర్లలో 205 పరుగులు చేసింది ఆర్సీబీ. సీఎస్కే బ్యాటింగ్ చూస్తే.., ఓటమి ఖాయం అని అనుకున్న సమయంలో 12 బాల్స్‌లో 43 పరుగులు కొట్టాల్సి ఉండగా.. విరాట్ కోహ్లీ బౌలింగ్ వేశాడు. కేవలం ఆ ఒక్క ఓవర్ లో 28 పరుగులు చేశాడు ఆల్బీ మార్కెల్. దాంతో ఒక్క ఓవర్ లో 15 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆ పనిని జడేజా, డ్వైన్ బ్రోవోలు ముగించారు.