మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ అనే సినిమాలో నటిస్తున్నారు.దీని తర్వాత తన 16వ చిత్రాన్ని ఎంతో గ్రాండ్ గా ప్రారంభించనున్నారు. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో ఈ పాన్ ఇండియా సినిమా తెరకెక్కనుంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి సోషల్ మీడియాలో ‘RC 16’ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. దీనికి కారణం ఈరోజు దర్శకుడి పుట్టినరోజు కావడమే.బుచ్చిబాబుకు బర్త్ డేకి విషెస్ తెలియజేస్తూ చిత్ర బృందం ట్విట్టర్ ‘ఎక్స్’లో ఓ పోస్ట్ పెట్టారు. #RC16 కోసం దర్శకుడు సృష్టించే రా అండ్ రస్టిక్ వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను కనువిందు చేస్తుందని పేర్కొన్నారు. రామ్ చరణ్ కోసం బుచ్చిబాబు ఓ రూరల్ స్పోర్ట్స్ డ్రామా కథని రాసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ స్క్రిప్టు మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్న దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఈ ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేయడానికి సిద్ధం అవుతున్నారు.’RC 16′ చిత్రాన్ని మార్చిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నారని తెలుస్తుంది.. మే నెలలో రెగ్యులర్ షూట్ కి వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్ళినా, 240 రోజుల్లో షూటింగ్ అంతా పూర్తి చెయ్యాలని భావిస్తున్నారట. అంతేకాదు 2025 మార్చి లాస్ట్ వీక్ లో రిలీజ్ చేసే విధంగా బుచ్చిబాబు అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.. ఈ నెల 27న రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ గా ఫస్ట్ లుక్ లేదా టైటిల్ అనౌన్స్ మెంట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.’ఉప్పెన’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బుచ్చిబాబు నుంచి రాబోతున్న సినిమా కావడం అదీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో నటిస్తుందటంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి