RBI New FD Rules: FD నిబంధనల్లో కీలక మార్పులు.. వడ్డీపై ప్రభావం ఎంత..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI New FD Rules: ఇవాళ్టి పొదుపే.. రేపు మీకు తోడుగా ఉంటుంది.. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది.. దాని కోసం డబ్బును వివిధ రూపాల్లో పెట్టుబడిగా పెడుతుంటారు.. చాలా మంది రిస్క్ ఫ్యాక్టర్ లేని ఫిక్స్డ్ డిపాజిట్లు (FD) పెడుతుంటారు.. అయితే, FDలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకొచ్చిన కొత్త నిబంధనలు 2026 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులు ప్రధానంగా బల్క్ డిపాజిట్లకు సంబంధించినవి. ప్రస్తుతం షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల్లో రూ.3 కోట్లు, అంతకంటే ఎక్కువ మొత్తాన్ని బల్క్ డిపాజిట్‌గా పరిగణిస్తున్నారు.
కొత్త నిబంధనల ప్రకారం బల్క్ డిపాజిట్లపై బ్యాంకులు తమ అవసరాలు, లిక్విడిటీ పరిస్థితులకు అనుగుణంగా వేర్వేరు వడ్డీ రేట్లను నిర్ణయించుకునే వెసులుబాటు ఉంటుంది. ముఖ్యంగా లిక్విడిటీ కవరేజ్ రేషియో (LCR) ఫ్రేమ్‌వర్క్, అన్సెక్యూర్డ్ బల్క్ డిపాజిట్లకు వర్తించే రన్ఆఫ్ రేట్లను పరిగణనలోకి తీసుకుని వడ్డీ రేట్లను నిర్ణయించే అవకాశం ఉంటుంది. మరో ముఖ్యమైన మార్పు వడ్డీ రేట్ల పారదర్శకతకు సంబంధించినది. బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై, ముఖ్యంగా బల్క్ డిపాజిట్లకు వర్తించే వడ్డీ రేట్లను తమ వెబ్సైట్లలో స్పష్టంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. బల్క్ డిపాజిట్లకు సంబంధించిన రేట్లను ప్రతి పనిదినం ఉదయం నిర్ణీత సమయానికి అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అదే తేదీన, ఒకే మొత్తానికి చెందిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు శాఖల మధ్య వివక్ష లేకుండా ఒకే రకమైన వడ్డీ రేట్లు వర్తించేలా నిబంధనలు రూపొందించారు. అంటే ఒకే రకమైన డిపాజిట్‌ను ఒకే తేదీన స్వీకరించినప్పుడు శాఖల ఆధారంగా వేర్వేరు వడ్డీ రేట్లు ఉండకూడదు.
Also Read
- SBI New Withdrawal Rules: మీకు SBIలో ఈ ఖాతా ఉందా..? విత్‌డ్రాయల్‌పై కొత్త ఛార్జీలు.. నయా రూల్స్ ఇవే
- LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం రూ.25 వేలకు పైగా పెన్షన్!
- PM SVANidhi Scheme: కేంద్రం గుడ్‌న్యూస్.. ఆధార్ ఉంటే చాలు రూ.90 వేల వరకు హామీలేని రుణాలు..
- Best FD Interest Rates August 2026: FDపై 8.50 శాతం వరకు వడ్డీ.. ఆగస్టు 2026లో టాప్ రేట్లు అందిస్తున్న బ్యాంకుల పూర్తి జాబితా
అయితే ఈ మార్పులు ప్రధానంగా రూ.3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలోని బల్క్ డిపాజిట్లకు సంబంధించినవి కావడంతో సాధారణంగా చిన్న మొత్తాలతో FDలు చేసే రిటైల్ పెట్టుబడిదారులపై ప్రత్యక్ష ప్రభావం పరిమితంగానే ఉండే అవకాశం ఉంది. అదే, సమయంలో వడ్డీ రేట్ల వివరాలను బ్యాంకులు మరింత పారదర్శకంగా వెల్లడించాల్సి రావడం ఖాతాదారులకు ఉపయోగపడనుంది. కాగా, FDలు స్థిరమైన రాబడి కోసం ఎంచుకునే ప్రముఖ పెట్టుబడి సాధనాల్లో ఒకటి. అయితే అన్ని బ్యాంకులు ఒకే వడ్డీ రేటును అందించవు. డిపాజిట్ మొత్తం, కాలపరిమితి, బ్యాంకు నిబంధనలు వంటి అంశాల ఆధారంగా రేట్లు మారవచ్చు. సీనియర్ సిటిజన్లకు కొన్ని బ్యాంకులు సాధారణ ఖాతాదారుల కంటే అదనపు వడ్డీని అందిస్తున్నాయి. కాబట్టి FD చేయడానికి ముందు సంబంధిత బ్యాంకు తాజా వడ్డీ రేట్లు, కాలపరిమితి, ముందస్తు ఉపసంహరణ నిబంధనలను పరిశీలించడం ఎంతైనా అవసరం..
తాజావార్తలు
-
Jadal Look: “మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా”.. ‘ది ప్యారడైజ్’ లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
-
Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
-
Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
-
Success Story: యూపీఎస్సీ కోసం 16 ప్రభుత్వ ఉద్యోగాలను తిరస్కరించింది.. కట్ చేస్తే ఐపీఎస్..
-
Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!