Shraddha Das : శ్రద్ధాదాస్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. సినిమాల సంగతి పక్కన పెడితే కుర్రకారును తన అందాలతో హీటెక్కించడమే పనిగా పెట్టుకుంది ఈ భామ. అప్పుడెప్పుడో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. సిద్ధు ఫ్రమ శ్రీకాకుళం సినిమాతో వచ్చిన ఈ కుర్ర బ్యూటీ.. ఇప్పటికీ ఏదో ఒక ఛాన్స్ అంటూ వెయిట్ చేస్తోంది. తెలుగులో పెద్దగా ఛాన్సులు రాకపోయేసరికి అప్పట్లో బెంగాళీ సినిమాల్లోకి వెళ్లింది. అటు నుంచి బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు చేసింది. కానీ ఎక్కడా స్టార్ ఇమేజ్ మాత్రం రాలేదు. దాంతో తిరిగి టాలీవుడ్ కు వచ్చింది. ఇక్కడ బుల్లితెరపై కొన్ని ప్రోగ్రామ్స్ చేసింది. కానీ అక్కడ కూడా కేవలం గ్లామర్ ను నమ్ముకుంది.
Read Also : Cyber Fraud: ఎంతకు తెగించార్రా.. బిల్ కట్టకపోతే కరెంట్ కట్ చేస్తామంటూ మెస్సేజ్ లు..
అందుకే అక్కడ కూడా నిలదొక్కుకోలేక బయటకొచ్చేసింది. ఇప్పుడు ఈవెంట్లు చేసుకుంటూ బిజీగా గడుపుతోంది. అదే టైమ్ లో ఏ చిన్న సినిమా అవకాశాలు వచ్చినా సరే చేసేస్తోంది. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో మరోసారి తన అందాలతో రచ్చ చేసింది. ఇందులో టాప్ లెస్ డ్రెస్ లో హీటెక్కించేస్తోంది. యమ నాటుగా కనిపిస్తున్న ఈ బ్యూటీ.. ఇందులో కత్తిలాంటి చూపులతో హీటెక్కిస్తోంది. ఇంత ఘాటుగా చూపించడం ఆమెకు కొత్తేం కాదునుకోండి. కానీ వయసు పెరుగుతున్నా తన అందం చెక్కు చెదరలేదని మరోసారి నిరూపించుకుంది ఈ వయ్యారి.