టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తండ్రి అనిరుధ్ సింగ్ జడేజా తన కుమారుడితో తనకున్న రిలేషన్ షిప్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. రివాబాతో రవీంద్ర జడేజా వివాహం అయిన తర్వాత, అతని కొడుకుతో అతని సంబంధం మునుపటిలా లేదని అనిరుధ్ సింగ్ చెప్పాడు. కుటుంబంలో చీలిక రావడానికి రివాబా కారణమని అనిరుధ్ సింగ్ ఆరోపించారు. ఒకే నగరంలో నివసిస్తున్నప్పటికీ, తన కొడుకును కలవలేకపోతున్నాడని చెప్పాడు. రవీంద్ర జడేజా క్రికెటర్ కాకపోయి ఉంటే బాగుండేదని…