Michael Clarke: జడేజా అలా చేస్తే బాగుండేది.. వివాదంపై ఆసీస్ మాజీ కెప్టెన్ స్పందన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఓ అనుమానాస్పద సంఘటన వివాదం రేపింది. టీమిండియా బౌలింగ్ సమయంలో రవీంద్ర జడేజా తన వేలికి ఆయింట్‌మెంట్ రాసుకుంటూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై మాజీ క్రికెటర్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ ఘటనపై తాజాగా ఆసీస్ మాజీ సారథి మైఖేల్ క్లార్క్ స్పందించాడు. జడేజా అలా చేసి ఉండకూడదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Also Read: Ravindra Jadeja: కపిల్ దేవ్ రికార్డ్ బద్దలు.. అగ్రస్థానంలో జడేజా
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
“చాలా రోజుల తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో జడేజా బౌలింగ్ వేశాడు. దీని కారణంగా అతడి వేలు బొప్పి కట్టడం ఉండవచ్చు. లేదా కోసుపోయినట్లు అనిపించి ఉండొచ్చు. అందుకే అతడు క్రీమ్ పూసికొని ఉంటాడు. అయితే, ఇలా చేసే ముందు చేతిలోని బంతిని అంపైర్‌కు ఇచ్చి ఉంటే బాగుండేది. అంపైర్‌కు ఇచ్చేసి అతడి ముందే జడేజా క్రీమ్ రాసుకొని ఉంటే ఇదొక చర్చనీయాంశం అయ్యేది కాదు. ఇప్పటికీ నేను దీనిని పెద్ద విషయంగా పరిగణించడం లేదు. కానీ, అతడి చేతిలో బంతి లేకుండా ఉంటే బాగుండేదని మాత్రమే నేను కోరుకుంటా. ఇందులో ఏదో జరిగిందని నేను అనుకోవడం లేదు. అయితే, నా అంచనా కూడా వందశాతం తప్పు కావచ్చు” అని క్లార్క్ అన్నాడు.
Also Read: Jeera Water: జీరా వాటర్‌తో ఎన్నో లాభాలు.. ఆ సమస్యలకి చెక్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ ఆధిక్యం సాధించింది. కాగా, మొదటి రోజు బౌలింగ్ చేసే సమయంలో టీమ్ఇండియా ప్లేయర్ రవీంద్ర జడేజా తన ఎడమ చేతి వేలికి ఆయింట్‌మెంట్ పూసుకోవడం చర్చనీయాంశమైంది. కంగారూ జట్టు అభిమానులు బాల్ ట్యాంపరింగ్ అంటూ ఆరోపణలూ చేశారు. కానీ పలువురు మాజీలు మాత్రం.. అలా చేసే సమయంలో బంతి చేతిలో ఉండకుండా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 177 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో రెండో రోజు ఆట ముగిసేసరికి టీమ్ఇండియా 7 వికెట్ల కోల్పోయి 321 పరుగులు చేసింది. ప్రస్తుతం 144 పరుగుల ఆధిక్యంలో ఉంది. బ్యాటింగ్‌లో అర్ధశతకం సాధించిన రవీంద్ర జడేజా 66* తొలి రోజు 5 వికెట్ల తీసి రాణించాడు.
Also Read: Snake Gourd: పొట్ల కాయ తింటే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!